/rtv/media/media_files/2025/10/19/pragya-2025-10-19-18-36-57.jpg)
మధ్యప్రదేశ్ బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. లవ్-జిహాద్ నుండి తమ కూతుళ్లను కాపాడుకోవాలని కోరుతూ తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తి చేస్తూ ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. విశ్వ హిందూ పరిషత్ (VHP) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, లవ్ జిహాద్ పేరుతో మైనారిటీలు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆరోపించారు.
మొదటి నుంచీ విలువలు నేర్పించండి
ఒకవేళ మీ కూతురు మీ మాట వినకుండా, మతం కాని వ్యక్తుల ఇళ్లకు వెళ్లడానికి ప్రయత్నిస్తే, వారిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ కూతుళ్ల కాళ్లు విరగ్గొట్టి వారిని ఇంటి నుంచి బయటకు పోనివ్వకండి. అప్పుడే మీ కుటుంబం సురక్షితంగా ఉంటుందని కామెంట్ చేశారు. ఇతర మతాలను తమ ఇష్టానుసారంగా వివాహం చేసుకునే అమ్మాయిలను నియంత్రించాలని ఆమె తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు.మీ కుమార్తెలకు మొదటి నుంచీ విలువలు నేర్పించాలని, కానీ వారు తన మాట వినకపోతే, తల్లిదండ్రులు వారిని కొట్టాల్సి వస్తే వెనక్కి తగ్గవద్దన్నారు.
❗️"Break legs of your daughters if she marries a non-Hindu."
— Rakesh Kishore 🇮🇳 (@RakeshKishore_l) October 19, 2025
- BJP leader Sadhvi Pragya Thakur
How many of you would agree with Sadhvi Pragya? pic.twitter.com/EI5OuZYWiO
ఒక కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెను లక్ష్మీ, సరస్వతిల రూపంగా భావిస్తారని, కానీ అదే కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్థుడిని కావాలని అనుకున్నప్పుడు ఆమెను ఆపడం అవసరమన్నారు. అలాంటి అమ్మాయిలను కంట్రోల్ లో ఉంచాలని అన్నారు. అలాంటి అమ్మాయిలను కొట్టి గుణపాఠం చెప్పడం మంచిదని చెప్పుకొచ్చారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఖండించింది.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మతపరమైన అంశాలపై ప్రజ్ఞా ఠాకూర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె చేసిన కొన్ని ప్రసంగాలు పెద్ద దుమారం రేపాయి. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆమె గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది, 2019 ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఈసీ ఆమెపై నిషేధం కూడా విధించింది.