/rtv/media/media_files/2025/09/05/harish-rao-on-a-visit-to-london-2025-09-05-08-22-48.jpg)
Harish Rao on a visit to London
HARISH RAO : బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి హరీష్‌రావు, సంతోష్ రావు కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ర్ట వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో దీనిపై మాజీమంత్రి హరీష్‌రావు ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. నిజానికి ఆయన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే లండన్‌కు బయలుదేరి వెళ్లారు. తన కూతురును కాలేజీలో జాయిన్ చేపించడానికి ఆయన లండన్ వెళ్లారు. ఆయన కుమార్తె ఉన్నత విద్య కోసం లండన్ కు వెళ్లిన ఆయన వెంట కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్ళినట్లు తెలుస్తోంది. లండన్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యల తర్వాత, హరీష్ రావు త్వరలోనే సమాధానం చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై ఇప్పటికే తన సన్నిహితులతో తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది.
లండన్ పర్యటన ముగించుకుని హరీష్‌రావు రేపు తిరిగిరానున్నారు. ఆయన రావడంతో నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లనున్నారు. అనంతరం పార్టీ అధినేత కేసీఆర్‌తో కవిత కామెంట్స్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి కవితకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు.
బీట్ అండ్ గ్రీట్‌లో హరీష్ రావు
కాగా కూతురి ఉన్నత విద్యకోసం లండన్ వెళ్లిన హరీష్ రావు బీఆర్‌ఎస్ యూకే విభాగం నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోబోనని సన్నిహితుల దగ్గర హరీష్ చెప్పినట్లు సమాచారం. నా వల్ల BRSలో ఇబ్బంది వస్తుందనడం దింపుడు కళ్లం ఆశ -అని హరీష్ ఎద్దేవా చేశారు.ఇప్పటికి కొన్ని వందల సార్లు దీనిపై క్లారిటీ ఇచ్చానన్న హరీష్ రావు. నేను క్రమశిక్షణ గల కార్యకర్తనని హరీష్‌రావు వెల్లడించినట్లు తెలిసింది.కేసీఆర్ నాయకత్వంలో చివరిశ్వాస వరకు పని చేస్తానని స్పష్టికరించారు.పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తానని హరీష్ రావు తేల్చిచెప్పారు.పార్టీ పుట్టుక నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో పని చేశానని, భవిష్యుత్తులో కూడా పని చేస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పై విమర్శలు
కాగా లండన్ పర్యటనలో ఉన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మేడిగడ్డలో మూడు ఫిల్లర్లు కూలితే రాద్ధాంతం చేస్తున్నారు. ఏడాదిన్నరగా కాలంగా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. వానకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదన్న ఆయన ఆ సమయంలో బాహుబలి మోటర్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రాతో హైదరాబాద్ లో రియల్ ఎస్టెట్ కుప్పకూలిందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు ముందుకు రావడం లేదని ఆరోపించారు.
అంబేద్కర్ హౌస్ సందర్శన
బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు లండన్ పర్యటనలో ఉన్నారు. గురువారం ఆయన లండన్‌లోని కింగ్ హెన్రీస్ రోడ్‌లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నివసించిన ఇంటిని సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యార్థిదశలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, గ్రేస్ ఇన్‌లో నివసించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ అంబేద్కర్‌కు హరీశ్‌రావు నివాళులు అర్పించారు. అంబేద్కర్ వారసత్వం, దార్శనికతను గౌరవిస్తూ సందర్శకుల పుస్తకంలో సందేశాన్ని రాశారు. అంబేద్కర్ ప్రవచించిన సమానత్వం, న్యాయం, సాధికారత ఆదర్శాలు సమ్మిళిత భారతదేశం, న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆ వివరాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సందర్భంగా హరీశ్ రావు బాబాసాహెబ్‌కు హృదయపూర్వక నివాళులు అర్పించారు.
Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!