'బిగ్ బాస్ సీజన్ 8' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. గూగుల్ వికీపీడియాలో 'బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్' గా నిఖిల్ పేరు ఉంది. అలాగే రన్నరప్ గా గౌతమ్ పేరు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
bb8 winner

తెలుగు బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 8' ఎట్టకేలకు ముగుంపు దశకు చేరుకుంది. దాదాపు 100 రోజులకు పైగా ఆడియన్స్ ను అలరించిన ఈ షోకు సంబంధించిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మొదలయ్యింది. 

స్టార్ మా ఛానెల్ తో పాటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'బిగ్ బాస్ 8' ఫినాలే ఎపిసోడ్ స్టీమింగ్ అవుతుండగా.. ఎప్పటిలాగే ఈసారి ఫినాలే ఎపిసోడ్ కు సెలెబ్రిటీలతో పాటూ ఈ సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ అందరూ వచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ పూర్తి కాకముందే ఈ సీజన్ విన్నర్ ఎవరో అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. 

Also Read: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం

విన్నర్ గా నిఖిల్..

అటు గూగుల్ లో 'బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్' అని సెర్చ్ చేస్తే.. విన్నర్ పేరు కూడా డిస్ప్లే అవుతోంది. ఇంతకీ 'బిగ్ బాస్ సీజన్ 8' విన్నర్ మరెవరో కాదు హౌస్ లో డే వన్ నుంచి తన ఆట తీరుతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న నిఖిల్.. గూగుల్ అధికారిక వికీపీడియా పేజీలో బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్.. రన్నరప్‌గా గౌతమ్‌ను ప్రకటించింది. 

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి గూగుల్ చెప్పినట్లు ఈసారి సీజన్ 8 టైటిల్ తో పాటూ రూ.55 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకునేది ఎవరో ఓ రెండు గంటల్లో తెలిసిపోతుంది. \

ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు