Allu Arjun : శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా.. అల్లు అర్జున్ సంచలన పోస్ట్

సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని అల్లు అర్జున్ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో అతని కుటుంబాన్ని కలుసుకోలేకపోతున్నాని తెలిపారు.

author-image
By Anil Kumar
New Update
allu arjun222

పుష్ప-2 ప్రీమయర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్ సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాలో పోరాడుతున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 11 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. 

Also Read :  నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం

ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబసభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు." శ్రీతేజ్ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. శ్రీతేజ్ ను, అతని కుటుంబాన్ని కలుసుకోవాలనుంది. 

Also Read :  పొట్టి శ్రీరాములు పేరుతో త్వరలో తెలుగు యూనివర్సిటీ

నా మాటకు కట్టుబడి ఉన్నా..

ప్రస్తుతం న్యాయపరమైన విచారణ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో శ్రీతేజ్ , అతని కుటుంబాన్ని కలుసుకోలేకపోతున్నా. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాననే నా మాటకు కట్టుబడి ఉన్నాను. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని  కోరుకుంటున్నాను. వీలైనంత త్వరగా బాధిత కుటుంబాన్ని కలుసుకుంటాను.." అని ట్వీట్ లో పేర్కొన్నారు. 

Also Read :  భర్తను హతమార్చిన భార్య.. పెళ్లయిన నాలుగు రోజులకే..

మరోవైపు బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు బన్నీ కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు చికిత్స ఖర్చులూ భరిస్తానని, ఆ ఫ్యామిలీకి ఎల్లప్పుడూ అండగా ఉంటానని కూడా హామీ ఇచ్చారు. 

Also Read :  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు