YS Sharmila: తన సోదరుడు, మాజీ సీఎం జగన్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. 2019 ఎన్నికల్లో తమకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వదో చూస్తానంటూ శపథాలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా చేయడంలో ప్రధాన ముద్దాయి మోదీ అయితే.. రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్ అని విమర్శించారు. విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు అని అన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని పేర్కొన్నారు. Also Read: "వన్ నేషన్ వన్ ఎలక్షన్"లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..! మోదీ పిలక చంద్రబాబు చేతుల్లో... షర్మిల ట్విట్టర్ లో.."హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోదీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు చెవుల్లో పూలు పెట్టారు. 25 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్ గారు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే. హోదాతోనే రాష్ట్రానికి విజన్. మోదీ పిలక మీ చేతుల్లో ఉంది. విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండి." Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు Also Read: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక! Also Read: రైతులకు గుడ్ న్యూస్..తాకట్టు లేకుండా 2లక్షల రుణం