త్వరలోనే భూమి అంతం.. న్యూటన్ చెప్పింది నిజం అవుతుందా?

భూమిఅంతం గురించి న్యూటన్ చెప్పిన విషయం గురించి ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. 2060 లో భూమి అంతమైతుందని భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త చెప్పాడు. బైబిల్‌లో ఉన్న సంకేతాలు, సంఖ్యల లెక్కల ఆధారంగా న్యూటన్ ఈ విషయాన్ని చెప్పాడు. దీనిపై అనేక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

New Update
Isaac Newton with earth

Isaac Newton with earth Photograph: (Isaac Newton with earth)

సర్ ఐజాక్ న్యూటన్ మరణించి 300 సంవత్సరాలు అయ్యింది. కానీ.. ఆయన చెప్పిన సైన్స్ సిద్ధాంతాలు కారణంగానే ఎన్నో ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. చలన, గురుత్వాకర్షణ సిద్ధాంతాలతోపాటు న్యూటన్ భూమి ఎప్పుడు అంతమోతుందో అని కూడా న్యూటన్ అంచనా వేశాడు. ఆ టైం రానేవచ్చింది. ఇప్పటి వరకు ఆయన చెప్పిన సిద్ధాంతాలు, ఫిజిక్స్ నియమాలు ఏ ఒక్కటి తప్పుకాలేదు. అలాగే భూమి అంతం గురించి కూడా కరెక్ట్‌గానే చెప్పాడిన కొందరు భావిస్తున్నారు. న్యూటన్ 1643లో జన్మించి 1727లో చనిపోయాడు.

గ్రహశకలాలు, సూర్యుడు, విశంలో వాతావరణ, బ్లాక్ హోల్స్ గురించి ఆయన ఆ కాలంలోనే వివరించాడు. అదే సమయంలో భూమి ఎప్పుడు అంతమైతుందో అంచనా వేసి చెప్పాడు. 2060లో భూమి అంతమైపోతుందని భౌతిక శాస్త్రవేత్త సర్ న్యూటన్ ఓ పేపర్‌లో రాశాడు. అంటే మరో 35ఏళ్లలో భూమి మీద యుగాంతం వస్తోందని పేర్కొన్నాడు. దీంతో శాస్త్రవేత్తలు న్యూటన్ ఏ కారణాలతో భూమి అంతమౌతుందని అన్వేషిస్తున్నారు.

Also Read : Kavitha Vs Revanth: తెలంగాణలో మూడు హత్యలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు!

న్యూటన్ గణిత గణాంకాల ఆధారంగా ఈ అంచనా వేశాడు. ఇది సైన్స్, మతం రెండిటిని కలపి చెబుతుంది. అంతరిక్షం, విశ్వం గురించి తెలుసుకోవడంలో న్యూటన్ ఆసక్తి చూపాడు. అందులో భాగంగానే భూమి ఎప్పుడు అంతమైతుందో అని అంచానా వేశాడు. బైబిల్లో ప్రస్తావించబడిన కొన్ని విషయాల ఆధారంగా, క్రీ.శ.800లో రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన తర్వాత, భూమి అంతానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఆయన అన్నారు. బైబిల్‌లో రాసిన సంకేతాలు, లెక్కల ప్రకారం చూస్తే భూమి 2060 సంవత్సరంలో నాశనమవుతుందని న్యూటన్ పేర్కొన్నాడు. చాలామంది ఖగోళశాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయంతో న్యూటన్‌ను చెప్పింది అవాస్తవమని అంటున్నారు. 2026లో భూమి అంతరించిపోతుందని అనడానికి ఎలాంటి సైటిఫిక్ ఆధారాలు లేవని చెబుతున్నారు.

Also Read: Delhi AIIMS: ఢిల్లీలోని ఎయిమ్స్‌‌లో అరుదైన ఆపరేషన్.. పొట్టలోని 2 కాళ్లు తొలగింపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు