Ap Rains: ఏపీని వరుణుడు మరోసారి పలకరించబోతున్నట్లు తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇటీవల ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటుగా దానిని ఆనుకుని ఉన్న హిందూమహాసముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
Also Read: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ డేట్ ఫిక్స్!
ఆ ప్రాంతంలోనే అల్పపీడనం...
ఈ ఆవర్తనం ప్రభావంతో ఆ ప్రాంతంలోనే అల్పపీడనం ఏర్పనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. ఈ అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో మరింత బలపడే అవకాశాలున్నాయి. డిసెంబర్ 11వ తేదీ నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది.
Also Read: పుష్పరాజ్ వసూళ్ళ సునామీ.. రెండు రోజుల్లోనే రికార్డు వసూళ్లు.. ఎంతంటే!
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదివారం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
Also Read: ముక్కలయ్యేందుకు సిద్ధంగా కూటమి..హ్యాండ్ ఇస్తున్న మిత్ర పక్షాలు
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంటపొలాల్లో నీరు నిలవకుండా బయటకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం కాస్తా ఫెంగల్ తుపానుగా మారటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు పడ్డాయి.
Also Read: బీజేపీ వల్లే రేవంత్ సీఎం అయ్యాడు.. బండి సంచలన వ్యాఖ్యలు!
ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడ్డాయి. దీంతో పలుచోట్ల పంటలు కూడా దెబ్బతిన్నాయి.తిరుమలలో రికార్డు స్థాయి వర్షాలు కురవటంతో కొండపైన ఉన్న ఐదు రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యానికి చేరుకున్నాయి. నిండుకుండలా మారి జలకళను సంతరించుకున్నాయి.
తాజాగా ఏర్పడిన తుపాను కూడా తమిళనాడు, శ్రీలంక వైపుగా పయనిస్తున్న నేపథ్యంలో రాయలసీమ, దక్షిణ కోస్తాలలో మరోసారి వర్షాలు కురిసే అవకాశాలు కనపడుతున్నాయి.