Zepto Car Delivery: జెప్టో యాప్‌లో కార్ల అమ్మకాలు.. మరి డెలివరీ ఎలా చేస్తారో తెలుసా?

జెప్టో యాప్‌ స్కోడా కార్ల కంపెనీతో టైఅప్ అయ్యింది. ఆన్‌లైన్‌లో కారు బుక్ చేసుకున్నవారికి జెప్టోలో కారు డెలివరీ ఇవ్వాలని స్కోడా నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 8 నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ టీసర్ వీడియోను Xలో పోస్ట్ చేశారు.

New Update
cars in zepto

cars in zepto Photograph: (cars in zepto )

Zepto Car Delivery: ప్రస్తుత రోజుల్లో డబ్బు ఉండాలే కానీ..చిటికేస్తే చాలూ ఏది కావాలన్నా డోర్ దగ్గరికే వస్తోంది. ఫుడ్, గ్రోసరీస్, నిత్యవసర వస్తువులు ఇలా అన్నీ ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఐదు, పది నిమిషాల్లో ఇంటి ముందుకే తీసుకొచ్చి ఇస్తారు. ఇదే తరహాలో స్కోడా కంపెనీ(Skoda Company) కూడా ఆలోచించింది. ఓ వినూత్న ఆలోచనతో వినియోగదారు ముందుకు వచ్చింది. స్కోడా కార్ల కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ జెప్టోతో టైఅప్ అయ్యింది. జెప్టో ఇప్పటికే కస్టమర్ల డిమాండ్‌ను బట్టి స్మార్ట్‌ ఫోన్స్‌, గేమింగ్‌ కన్సోల్స్‌ ఇతర ఖరీదైన వస్తువులను కూడా నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు కార్లను కూడా డెలివరీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

స్కోడా ఇండియా సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. ఈ టీజర్‌ వీడియో చూస్తే స్కోడా ఇండియా.. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ జెప్టోతో కలిసి కార్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ స్కోడా షోరూమ్‌కు వెళ్లడం.. అక్కడ ఓ కారును డెలివరీ చేసేందుకు ట్రక్కులో తీసుకెళ్తోన్నట్లు వీడియోలో ఉంది. ఇది టీసర్‌ అని స్కోడా ఇండియా అన అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

Also Read: Prabhakar: 'సరిపోదా గురువారం'.. నాని సినిమా ఆదర్శంగా క్రిమినల్ ప్రభాకర్ ఆగడాలు!

స్కోడా x జెప్టో: కమింగ్ సూన్..

వీడియో చివర్లో స్కోడా x జెప్టో: కమింగ్ సూన్ అంటూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు జెప్టోలో కార్లు ఎలా డెలివరీ చేస్తారని షాక్ అవుతున్నారు. కిరాణా సామగ్రి మాదిరిగానే నిమిషాల్లోనే కార్లు కూడా డెలివరీ చేస్తారా..? లేక ఎక్కువ సమయం పడుతుందా..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: YS Viveka Murder Case: వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మరో నలుగురిపై కేసు!

Also Read: ప్రముఖ వ్యాపారవేత్త పింకీ రెడ్డి ఫోన్ హ్యాక్! రిప్లై ఇవ్వదంటూ పోస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు