Vivo-Zepto: జెప్టోలో వివో ఫోన్లు డెలివరీ.. 10 నిమిషాల లోపే ఇంటికి: రూ. 5,000 తగ్గింపు కూడా!
వివో తన స్మార్ట్ఫోన్లను డోర్ డెలివరీ చేయడానికి క్విక్ కామర్స్ సర్వీస్ జెప్టోతో చేతులు కలిపింది. దీంతో ఆర్డర్ అందుకున్న 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ఎంచుకున్న స్మార్ట్ఫోన్ డెలివరీ కానుంది. పరిచయ ఆఫర్ కింద రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది.