Viral Video: పొలంలో నాట్లు వేసిన రింకూ సింగ్‌కు కాబోయే భార్య.. ఎంపీ వీడియో వైరల్

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పొలంలో దిగి, స్వయంగా వరి నాట్లు వేస్తున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెను "జమీన్ కీ బేటీ" (భూమి పుత్రిక) అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

New Update
MP Priya Saroj video goes viral

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ నియోజకవర్గం నుంచి గెలిచి, దేశంలోనే అతి పిన్న వయస్కులైన ఎంపీలలో ఒకరిగా నిలిచిన ప్రియా సరోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పొలంలో దిగి, స్వయంగా వరి నాట్లు వేస్తున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెను "జమీన్ కీ బేటీ" (భూమి పుత్రిక) అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read :  తల్లే విలన్!.. గండికోట యువతి హత్య కేసులో షాకింగ్ నిజాలు!

MP Priya Saroj Video Goes Viral

ఆదివారం నాడు వారణాసిలోని పింద్రా తహసీల్ ప్రాంతంలోని కార్ఖియాన్‌లో తన గ్రామం వైపుగా వాకింగ్ వెళ్తూ, అటుగా తన పొలానికి కూడా వెళ్లారు ప్రియా సరోజ్. అక్కడ పొలంలో పనిచేస్తున్న ఇతర మహిళలు, తన స్నేహితులతో కలిసి ఆమె కూడా వరి నాటారు. ఏదో తూతూ మంత్రంగా కాకుండా, సుమారు 5 ఎకరాల భూమిలో ఆమె స్వయంగా పనిచేసినట్లు సమాచారం.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఆమె వరి నాటుతున్న తీరు, రైతుల శ్రమకు గౌరవం ఇస్తున్న విధానం నెటిజన్లను ఆకట్టుకున్నాయి. కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అని విమర్శించినా, అధిక సంఖ్యలో నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. గ్రామీణ జీవన విధానంతో కనెక్ట్ అవ్వడం, ప్రజలకు చేరువవ్వాలంటే ఇలాంటి పనులే చేయాలని అభిప్రాయపడుతున్నారు.

Also Read :  పార్టీ కోసమే రీమేకులు.. అసలు విషయం చెప్పిన పవన్!

Also Read :  గాజాలో మారణహోమం.. 59 వేల మందికి పైగా మృతి

కాగా, ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ కూడా రైతే, మూడుసార్లు ఎంపీగా గెలిచి, ప్రస్తుతం యూపీలోని కేరకత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమె కుటుంబానికి వ్యవసాయంతో బలమైన సంబంధం ఉండటంతో, ప్రియా సరోజ్‌కు పొలంలో పనిచేయడం కొత్త కాదని స్థానికులు చెబుతున్నారు. ఆమె వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. భారత క్రికెటర్ రింకూ సింగ్ కాబోయే భార్యగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది.

ప్రియా సరోజ్ చర్య ప్రజలకు మరింతగా చేరువవడానికి, రైతుల సమస్యల పట్ల ఆమెకున్న అవగాహనను తెలియజేయడానికి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె సాధారణ జీవితం పట్ల కనబరుస్తున్న ఆసక్తి భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు.

Also Read :  తండ్రితో కలిసి భర్తను చంపిన భార్య

Viral Video | mp | Samajwadi Party MP | MP Priya Saroj paddy

Advertisment
తాజా కథనాలు