/rtv/media/media_files/2025/10/27/hyderabad-2025-10-27-17-26-29.jpg)
Hyderabad
Hyderabad: 18 అంతస్తుల ఎత్తులో ఉన్న హైటెన్షన్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి సూ**సైడ్ అటెంప్ట్ చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. వివారాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఓ వ్యక్తి సూ**సైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే 18 అంతస్తుల ఎత్తులో ఉండే టవర్‌పైకి ఎక్కాడు. దీంతో ఇతన్ని కాపాడేందుకు పోలీసులు, హైడ్రా, ఫైర్ అధికారులు ప్రయత్నించారు. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నీ సమస్యను మేం తీరుస్తామని చెప్పినా కూడా వినకుండా ఆ వ్యక్తి దూకే ప్రయత్నం చేయడంతో.. హైడ్రా, ఫైర్ సిబ్బంది క్రేన్ సహకారంతో టవర్ ఎక్కారు.
ఇది కూడా చూడండి: TG Crime: తెలంగాణలో విషాదం. కుక్క కాటు గురించి దాచిపెట్టిన బాలిక.. నెల రోజుల తర్వాత రేబిస్‌తో మృతి
షాకింగ్ విజువల్స్
— Telugu Scribe (@TeluguScribe) October 27, 2025
తనకు పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో సంఘటన
పోలీసులు, విద్యుత్ అధికారులు కిందకి దించే ప్రయత్నంలో, వారి నుండి తప్పించుకొని దూకిన యువకుడు
టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం pic.twitter.com/2IOjeQnPc1
ఇది కూడా చూడండి: TG Crime: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని విద్యార్థి దుర్మరణం
అధికారులు కష్టపడి అతని దగ్గరికి వెళ్లినా..
ఎంతో కష్టం మీద అతని దగ్గరికి చేరి.. వారు కాపాడే ప్రయత్నం చేశారు. అతని దగ్గరికి వెళ్లి చేయి పట్టుకునే సమయంలో అధికారుల చేతులు వదిలించుకుని టవర్‌పై నుంచి దూకి బురదలో పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన అతన్ని స్థానికి ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. ఆ వ్యక్తి ఏ కారణంగా సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడనే విషయంపై క్లారిటీ లేదు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us