Trump Viral video: 'బలగం' పాటకు ట్రంప్ మామ యాక్షన్.. వీడియో చూస్తే ఫిదా అవుతారు!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సాధారణ రైతులా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సైకిల్‌పై గడ్డిమోపు, పొలంనుంచి ఆవును తోలుకొస్తూ, పిల్లలతో దీపావళీ సెలబ్రేషన్స్ చేస్తూ ఔరా అనిపించాడు. ఏపీ సీఎంతోనూ సైకిల్‌పై ప్రయాణించారు. AI వీడియో నవ్వులు పూయిస్తోంది.

New Update
trunmp

Donald Trump simple farmer looks viral

Trump Viral video: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి జనాలను ఆశ్చర్యానికి గురి చేశారు. అచ్చం పల్లెటూరి వ్యక్తిలా వ్యవసాయం చేస్తూ నవ్వులు పూయించారు. పోలంనుంచి సైకిల్ పై పచ్చిగడ్డి, ఆవులను తోలుకొస్తూ ఆనందపరిచారు. అంతేకాదు ఖాళీ సమయంలో అరుగులపై కూర్చోని తోటివారితో సరదాగా సంభాషించారు.

చంద్రబాబుతో సైకిల్ యాత్ర..

ఆ తర్వాత చెట్టు ఎక్కి పూలు తెంపారు. దీపావళీ సందర్భంగా పిల్లలో టపాసులు కాలుస్తూ దీపాల కాంతుల్లో మురిసిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబుతో సైకిల్ యాత్ర చేయడం, భోజనం, చేయడం, ఆ తర్వాత చంద్రబాబు నుంచి బహుమతి అందుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా జనం ఆశ్యర్యపోతున్నారు. 

అయితే నిజానికి ఇది నిజమైన వీడియో కాదు. AI మహిమ. ట్రంప్ సాధారణ భారత రైతుగా మారి, పల్లెటూరిలో ఉంటే ఎలా ఉంటాడో చూపించేందుకు ఇలా క్రియేట్ చేశారు. సైకిల్‌ మీద గడ్డిమోపు, ఆవును తోలుకెళ్తూ, చెట్టెక్కి పూలుకోస్తూ, మనవడు మనవరాళ్లకు కానుకలు కొనిస్తూ సరదాగా గడిపుతున్న దృశ్యాలను AIతో సృష్టించగా చూడటానికి చాలా బాగున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘బలగం’ సినిమా పాటను కూడా జతచేయగా మరింత అద్భుతంగా అనిపిస్తోంది. 

Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

ఇక ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'AI సూపర్ మ్యాజిక్. ట్రంప్ మామకు ఈ గెటప్ సెట్ అయింది. ఇది చూసైనా మీరు భారత్‌కు టారిఫ్‌లు వేయకండి' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు

ai-video | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు