Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎయిర్‌సెల్ అధినేత ఆనంద్ కృష్ణన్ కుమారుడు అజాన్ 18 సంవత్సరాల వయసులో తన తల్లి తరుఫున బంధువుల కోసం థాయ్‌లాండ్ వెళ్లాడు. ఆ పర్యటన అతని జీవితాన్నే మలుపు తిప్పింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 27 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి..ఆయన కోరుకుంటే సకల భోగాలు ఆయన కళ్ల వద్దకే వచ్చి చేరతాయి.లెక్కలేనన్ని వ్యాపారాలు.. నిత్యం విందులు వినోదాలతో సాగిపోయే జీవితం... కానీ, ఇవన్నీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. విలాసాలు క్షణికానందమేనని అనుకున్నాడు. బౌద్ధ భిక్షువులను చూసి సరదాగా సన్యాసిగా మారిన అతడికి అందులోనే నిజమైన ఆనందం ఉందని అనుకున్నాడు. దీంతో ఒకటి రెండు కాదు ఏకంగా 40 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి శాశ్వతంగా సన్యాసిగా మారిపోయాడు ఈ అభినవ గౌతమ బుద్ధుడు. Also Read: TG: మూసీ నిర్వాసితులకు హైకోర్ట్ బిగ్ షాక్..కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ Indian Billionaire నిత్యం జోలె పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు. అతను మరేవరో కాదు మలేషియాలో మూడో అతిపెద్ద బిలియనీర్, భారత సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్ అలియాస్ ఏకే ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో. మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఏకే వ్యాపార సామ్రాజ్యం విలువ 5 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.44 వేల కోట్ల పైమాటే. ఇక, అజాన్ 18 సంవత్సరాల వయసులో థాయ్ రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు థాయిలాండ్ వెళ్లారు. Also Read: గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా..పేటెంట్ పొందిన బాపట్ల కాలేజీ బృందం ఆ పర్యటనే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి ప్రేరణ పొందాడు. సరదా కోసం తాను సన్యాసిగా మారాలనుకున్నాడు. కానీ, నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడై.. ఏకంగా రూ. 40 వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. తన ఆధ్యాత్మిక మార్గానికి ఇవన్నీ అడ్డుగా భావించిన అజాన్ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ప్రాపంచిక సుఖాలను వదిలి.. బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్నాడు. ప్రస్తుతం పీఠాధిపతిగా థాయ్ ల్యాండ్- మయున్మార్ సరిహద్దు ప్రాంతంలో బౌద్ధవుగా బతుకుతున్నాడు. తన ఇద్దరు సోదరిమణులతో లండన్‌లో పెరిగిన అజాన్.. అక్కడే చదువుకున్నాడు. Also Read: అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా భారతీయుడు..అసలేవరి భట్టాచార్య! ఇంగ్లిష్ సహా మొత్తం ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. సన్యాసిగా జీవనం సాగిస్తున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆయన తన తండ్రిని కలిసేందుకు తన ప్రైవేట్ జెట్‌లో వెళ్తుంటాడని పలువురు అంటుంటారు. అజాన్ తండ్రి ఆనంద్ కృష్ణన్.. తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త. టెలికమ్, శాటిలైట్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ సహా పలు రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు. Also Read: AP: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త! గతంలో ఎయిర్‌సెల్ పేరుతో టెలికం రంగంలో గుర్తింపు పొందారు. అంతేకాదు, ఐపీఎల్‌లో ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్పాన్సర్ కూడా, బిజినెస్ టైకూన్‌గా ఎదిగిన ఏకే.. వేల కోట్లు ఉన్నా తన కొడుకుకు సంతోషాన్ని ఇవ్వలేని అసమర్థుడినంటూ ఆయన ఓ సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ, కొడుకు ఇష్టాన్ని గౌరవించడం ఓ తండ్రిగా నా బాధ్యత అని చెప్పుకొచ్చారు. #ajahn-siripanyo #indian-billionaire #ananda-krishnan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి