Tamil Nadu : హ్యాట్సాఫ్ రా బుడ్డోడా.. ఇండియన్ ఆర్మీకి పాకెట్ మనీ విరాళం!

తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన 8 ఏళ్ల సాయి ధన్విష్ గత పదినెలలుగా తాను పొదుపు చేసుకున్న మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ధన్విష్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

New Update
indian-army-boy

తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన 8 ఏళ్ల సాయి ధన్విష్ గత పదినెలలుగా తాను పొదుపు చేసుకున్న మొత్తాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి దేశ ప్రజల  హృదయాలను గెలుచుకున్నాడు.  2వ తరగతి చదువుతున్న ధన్విష్ తన తల్లిదండ్రులతో కలిసి కరూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తాను పొదుపు చేసుకున్న కలెక్షన్ బాక్స్‌ను ఆయనకు అందజేశాడు. ధన్విష్ భారత సైన్యానికి ఈ డబ్బును విరాళంగా ఇస్తున్నట్లుగా కలెక్టర్ కు వెల్లడించాడు.

Also Read :  ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ!

Also Read :  యువకుడి ప్రాణం తీసిన ట్రాన్స్ఫార్మర్.. లైవ్ లోనే ఘోరం ( వీడియో వైరల్)

ఇది నా బాధ్యత

ఆ బాలుడు మీడియాతో మాట్లాడుతూ..  “నేను రెండవ తరగతి చదువుతున్నాను. మనల్ని రక్షించే సైన్యానికి సహాయం చేయాలనుకుంటున్నాను. మనల్ని రక్షించే వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో నేను నా డబ్బునంతా ఆర్మీ సైనికులకు ఇవ్వడానికి దాచుకున్నాను. ఇది నా బాధ్యత ” అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో వయనాడ్ కొండచరియలు విరిగిపడిన బాధితులకు కూడా ధన్విష్ విరాళాలు ఇచ్చాడు.

వెల్లియానైలో చేపల దుకాణం నడుపుతున్న సతీష్ కుమార్, పవిత్ర దంపతులకు జన్మించిన ధన్విష్ కు నాలుగు సంవత్సరాల వయస్సు గల జితేష్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు జూన్ 29న ధన్విష్ అవసరమైన వారికి ఆహారం, దుస్తులు పంపిణీ చేస్తుంటాడు. ఇంత చిన్న వయసులో జితేష్ కు వచ్చిన ఆలోచనలకు ఎవరైనా సరే హ్యాట్సాఫ్ అని చెప్పకుండా ఉండలేం కదా! 

Also read :  Liquor Scam: తమిళనాడులో లిక్కర్ స్కాం ప్రకంపనలు..భారీగా వసూళ్లు

Also Read :  జెట్ స్పీడ్ లో మురుగదాస్ ‘మధరాసి'.. రిలీజ్ ఎప్పుడంటే..?

netizens

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు