Vikram Lander is set into sleep mode: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయింది. ఈ ప్రయోగంతో ఇండియా అమెరికా, రష్యా, చైనాల పక్కన గర్వంగా నిలబడగలిగింది. చంద్రు(Moon)ని మీ సేఫ్ గా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు సమర్థవంతంగా పని చేస్తున్నాయి. అయితే చంద్రుని మీద లూనార్ నైట్ ప్రారంభం అవడం వల్ల ఇస్రో విక్రమ్, ప్రజ్ఞాన్ లను ఈ నెల 2, 4 తేదీల్లో నిద్రాణ స్థితిలోకి పంపింది. ఇప్పుడు మరో రెండు రోజుల్లో లూనార్ నైట్ ముగిసి మళ్ళీ చంద్రుని మీద పగలు మొదలవుతుంది.
దీని కోసం భారత అంతరిక్ష పరిశోధనా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చాక ఎలా పని చేస్తాయో చూడాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ నెల 22 న ల్యాండర్, రోవర్ లు స్లీప్ మోడ్ నుంచి బయటకు వస్తాయని ఇస్రో (ISRO) అంచనా వేస్తోంది. లూనార్ డే మొదలయ్యాక చంద్రుని మీద ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ వాతావరణానికి ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకోగలగడం, రీఛార్జ్ కావడం మీదనే వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది. అయితే ఎలాగైనా ల్యాండర్, రోవర్ లను మేల్కొలిపి మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: Chandrayaan-3 Recent Updates
ఇప్పటికే చంద్రుని మీద ప్రజ్ఞాన్ రోవర్ చాలా విషయాలను క్యాప్చర్ చేసింది. మూన్ మీద నీటి జాడలు, మట్టి, వాయువులు లాంటి విషయాల గురించి తెలుసుకుంటోంది. అలాగే చంద్రుని దక్షిణ ధ్రువం మీద సల్ఫర్ మూలకం చాలా ఎక్కువగా ఉందని రోవర్ గుర్తించింది. అల్యూమినియం, క్యాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీసు, సిలికాన్, ఆక్సిజన్ కూడా ఉన్నట్లు కనుగొంది. ఇక జాబిల్లి మీద ఉష్ణోగ్రతలు 70 డిగ్రీల వరకూ ఉంటుందని తెలిపింది.
Also Read: ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్..!