Chandrayaan-3: చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సిగ్నల్స్..
చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సంకేతాలు అందుతున్నాయి అని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దక్షిణ ధ్రువంలో నిద్రాణ స్థితిలోనూ చంద్రయాన్ లొకేషన్లు గుర్తిస్తోందని చెబుతున్నారు.
చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సంకేతాలు అందుతున్నాయి అని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దక్షిణ ధ్రువంలో నిద్రాణ స్థితిలోనూ చంద్రయాన్ లొకేషన్లు గుర్తిస్తోందని చెబుతున్నారు.
భారతదేశం చంద్రుని మీదకు పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో చంద్రుని మీద పగలు మొదలయ్యాక మళ్ళీ అవి పని చేయడం మొదలుపెడతాయి.
చంద్రయాన్ -3 కు సంబంధించి తాజాగా ఇస్రో మరికొన్ని ఫోటోలను విడుదల చేసింది. చంద్రుని ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ రోవర్ తీసి పంపింది. ప్రజ్జాన్ రోవర్ పై ఉన్న నావిగేషన్ కెమెరా ద్వారా ఈ ఫోటోలను చిత్రీకరించినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ఆదిత్య ఎల్-1కు సంబంధించి లాంఛ్ రిహార్సల్ పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ కు సంబంధిచి ఏర్పాట్లు జరుతున్నాయని ఇస్రో పేర్కొంది. సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది.
చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ మరికొద్ది గంటల్లో ల్యాండ్ కానుంది. ఈ రోజు సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మిషన్ సక్సెస్ కావాలని యావత్ భారత్ మొత్తం కోరుకుంటోంది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్ ల్యాండ్ కావడంతో మిషన్ లో మనం సగం విజయాన్ని సాధించినట్టు అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన పని మొదలవుతుంది. ఒక లూనార్ డే(భూమిపై 14 రోజులు) వరకు ఇస్రో శాస్త్రవేత్తలు బిజీగా పనిచేయనున్నారు.
చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 మిషన్ లోని విక్రమ్ ల్యాండింగ్ మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియను(కక్షను మరింత తగ్గించుకుంది) పూర్తి చేసుకుంది. దీంతో ల్యాండర్ చంద్రునికి మరింత సమీపంలోకి చేరుకుంది. ఈ నెల 23న ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.