Rajamouli Movie: రాజమౌళి మహేష్ సినిమాలో చియాన్ విక్రమ్!
రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం.
రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం.
విక్రమ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ల ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆల్ ఇన్ పిక్చర్స్ నుంచి దర్శకుడు గౌతమ్ తీసుకున్న డబ్బును నవంబర్ 24న ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఈ సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.
భారతదేశం చంద్రుని మీదకు పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. మరో రెండు రోజుల్లో చంద్రుని మీద పగలు మొదలయ్యాక మళ్ళీ అవి పని చేయడం మొదలుపెడతాయి.
చంద్రయాన్ -3 కు సంబంధించి తాజాగా ఇస్రో మరికొన్ని ఫోటోలను విడుదల చేసింది. చంద్రుని ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఫోటోలను ప్రజ్ఞాన్ రోవర్ తీసి పంపింది. ప్రజ్జాన్ రోవర్ పై ఉన్న నావిగేషన్ కెమెరా ద్వారా ఈ ఫోటోలను చిత్రీకరించినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ఆదిత్య ఎల్-1కు సంబంధించి లాంఛ్ రిహార్సల్ పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ లాంచింగ్ కు సంబంధిచి ఏర్పాట్లు జరుతున్నాయని ఇస్రో పేర్కొంది. సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది.
చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలకమైన విషయాలను చంద్రయాన్-3 ఇస్రోకు అందించింది. దీని ప్రకారం చంద్రుని ఉపరితలంపై లోతుని బట్టి ఉష్ణోగ్రత మారుతూ వుందని పేర్కొంది. చంద్రుని ఉపరితలంపై -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు మారుతూ వున్నట్టు పేర్కొంది. మరికొన్ని వివరాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపింది.
చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ మరికొద్ది గంటల్లో ల్యాండ్ కానుంది. ఈ రోజు సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మిషన్ సక్సెస్ కావాలని యావత్ భారత్ మొత్తం కోరుకుంటోంది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్ ల్యాండ్ కావడంతో మిషన్ లో మనం సగం విజయాన్ని సాధించినట్టు అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన పని మొదలవుతుంది. ఒక లూనార్ డే(భూమిపై 14 రోజులు) వరకు ఇస్రో శాస్త్రవేత్తలు బిజీగా పనిచేయనున్నారు.
ఇస్రో ఓ ఆసక్తి కరమైన విషయాన్ని ప్రజలతో పంచుకుంది. చంద్రయాన్ 2 కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటార్..విక్రమ్ కు వెల్కమ్ చెప్పింది. ఈ విషయం గురించి ఇస్రో తన ట్విట్టర్ లో పేర్కొంది. ''వెల్కమ్ బడ్డీ'' అంటూ ఆ మెసేజ్ లో పోస్టు చేశారు.
చంద్రయాన్-3కి సంబంధించి ఇవాళ(ఆగస్టు 6) కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇస్రో జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 అంతా అనుకున్నట్టుగానే చంద్రుడివైపు అడుగులేస్తోంది. ఇవాళ చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3 ఎంట్రీ ఇవ్వనుంది. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ (విక్రమ్) వేరు అవుతుంది.