Chandrayaan-3: జాబిల్లిపై చిమ్మ చీకటి.. శాశ్వత నిద్రలోకి చంద్రయాన్.. రోవర్, ల్యాండర్ ఏం చేస్తాయి?
సూర్యుడు మరోసారి చంద్రుడిపై అస్తమించాడు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు 14 భూమి రోజులకు సమానమైన చంద్రుడి రోజున మేల్కొనలేదు. అంటే భారత్ మిషన్ ముగిసినట్టేనన్న వాదన వినిపిస్తోంది. చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్, విక్రమ్ ద్వయం మేల్కొనకపోతే, అది ఎప్పటికీ భారత లూనార్ అంబాసిడర్గా అక్కడే ఉంటుందని ఇస్రో ఇదివరకే తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై కొన్ని ప్రయోగాలను పునరావృతం చేయడానికి ఇది ఒక అవకాశం. కానీ విక్రమ్, ప్రజ్ఞాన్ స్పందించలేదు.