Rain Alert in AP: ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్..! ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ(IMD). రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. By Shiva.K 20 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Andhra Pradesh Weather Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ(IMD). రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం.. పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిస్సా తీరానికి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇక అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవిరించి ఉన్నట్లు వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. మరో రెండు రోజుల్లో దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఒడిస్సా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అయితే, దీని ప్రభావంతో ఏపీలో రాగల మూడు రోజులపాటు వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరి వర్షాలు ఎక్కడెక్కడ పడుతాయో ఓసారి తెలుసుకుందాం.. ఈ అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో బుధవారం నాడు చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ కోస్తాంధ్రాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమలోనే దాదాపుగా ఇదే పరిస్థితి ఉండనుంది. సీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇకపోతే.. తీరం వెంబడడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో.. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే 3 రోజులలో ( Till September 22) ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం మరియు రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ‼️ pic.twitter.com/OndnybkTqo — Vizag Weatherman@AP (@VizagWeather247) September 19, 2023 నిన్నటి నుంచి వర్షాలు.. ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. విశాఖలో అయితే వర్షం దంచికొట్టింది. దాదాపు గంటపాటు వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా విశాఖలో లోతట్టు ప్రాంతాల్లోకి వదర నీరు వచ్చి చేసింది. ఇవాళ కూడా విశాఖ నగరం వ్యాప్తంగా ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. భారీ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. Also Read: నేడు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. కాంగ్రెస్ తరఫున మాట్లాడనున్న సోనియా గాంధీ.. India Canada Row : పరువు పోగొట్టుకున్న కెనడా..మండిపడుతున్న అగ్రదేశాలు..!! #rain-alert-in-ap #heavy-rain-alert-in-ap #ap-weather-report #imd-issued-heavy-rain-alert-in-ap #andhra-pradesh-weather-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి