/rtv/media/media_files/2026/01/13/vijay-2026-01-13-19-37-44.jpg)
Vijay
తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత హీరో విజయ్ మహిళల సంక్షేమం కోసం సరికొత్త మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళల సాధికారత, వారి ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పథకాలను ప్రకటించారు. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రతీ నెలా కూడా రూ.2500 నగదును అందించనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే గృహిణులకు ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం తగ్గించేలా ప్రతి పెళ్లికి 8 గ్రాముల బంగారం బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Vijay Thalapathy విజయ్‌కు బిగ్ షాక్.. కోర్టులో భార్య మరో పిటిషన్
TVK Manifesto: Free 6 LPG cylinders yearly under Annapoorani Scheme, ₹2,500 monthly assistance for women (excluding govt employee families), Annan Seer Thittam with 1 sovereign gold & silk saree for sisters’ marriage, and free sanitary napkins for women.
— raveena (@raveeeeee___) March 7, 2026
-@TVKVijayHQ
ఇది కూడా చూడండి: Vijay Divorce : విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్: రూ.250 కోట్ల సెటిల్మెంట్కు విజయ్ సిద్ధం?
పెళ్లిళ్లకు బంగారం..
మహిళల ప్రయాణ సౌకర్యార్థం తమిళనాడు అంతటా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని విజయ్ తెలిపారు. మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు మహిళా సమస్యల పరిష్కారానికి, వారి అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా ఆడపిల్ల జన్మిస్తే.. ఆ నవజాత శిశువులకు బంగారు ఉంగరాన్ని కానుకగా అందజేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని అమలు చేస్తామని తెలిపారు.
ఇది కూడా చూడండి: Viral Video: పెళ్లికి ఒకే కారులో విజయ్-త్రిష.. విడాకుల వివాదం తర్వాత ఫస్ట్ టైం!
Thalapathy #Vijay Announces TVK Manifesto For Women:
— cinee worldd (@Cinee_Worldd) March 7, 2026
• ₹2500 per month
• 6 cylinders per year
• 8 grams of gold for marriage
• Frees buses all over TN
• Free Napkins
• Separate Department
• Gold ring for new born babies pic.twitter.com/XVwI21XIsY
ఇది కూడా చూడండి: TVK Vijay: TVK విజయ్ కు బిగ్ షాక్.. విడాకులు కావాలని కోర్టుకెక్కిన భార్య!
Follow Us