TVK Vijay: TVK విజయ్ కు బిగ్ షాక్.. విడాకులు కావాలని కోర్టుకెక్కిన భార్య!

ప్రముఖ నటుడు,  తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ భార్య సంగీత కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నుండి విడాకులు కోరుతూ ఆమె ఈ రోజు  చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

New Update
vijay

BIG BREAKING: ప్రముఖ నటుడు,  తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్(tvk vijay) భార్య సంగీత కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నుండి విడాకులు కోరుతూ ఆమె ఈ రోజు  చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు మార్చి 20వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రముఖ నటితో విజయ్‌కు ఉన్న సంబంధం కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read :  బీజేపీ10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేజ్రీవాల్  సవాల్!

1999లో వివాహం

ముఖ్యంగా గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు, ఇప్పుడు అది అధికారికంగా విడాకుల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. 1999లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు (జోసన్ సంజయ్), ఒక కుమార్తె (దివ్య సాషా) ఉన్నారు. దాదాపు 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. 

విజయ్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ వ్యక్తిగత పరిణామాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న చర్చ మొదలైంది.

సంగీత శ్రీలంకకు చెందిన తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సోర్ణలింగం లండన్‌లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆమె లండన్‌లోనే పెరిగారు.

1996లో విజయ్ నటించిన పూవే ఉనక్కాగా'సినిమా చూసిన సంగీత, ఆయనకు పెద్ద అభిమానిగా మారిపోయారు. కేవలం ఆయనను కలవడం కోసమే ఆమె లండన్ నుండి చెన్నైకి వచ్చారు. షూటింగ్ సెట్స్‌లో విజయ్‌ను కలిసి అభినందించిన ఆమె, ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కూడా నచ్చడంతో వీరి వివాహానికి పునాది పడింది. 

ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 25, 1999న వీరి వివాహం జరిగింది. స్టార్ హీరో భార్య అయినప్పటికీ, సంగీత ఎప్పుడూ మీడియా వెలుగులకు దూరంగా ఉండటానికే ఇష్టపడతారు.

Also Read :  DMK పార్టీలో చేరిన పన్నీర్‌ సెల్వం..

Advertisment
తాజా కథనాలు