Vijay Divorce : విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్: రూ.250 కోట్ల సెటిల్‌మెంట్‌కు విజయ్ సిద్ధం?

తమిళ స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్ విడాకుల ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కు ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ స్వయంగా ఆయన భార్యే ఆరోపిస్తూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేయడం సంచలనంగా మారింది.

New Update
vijay

తమిళ స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్ విడాకుల ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కు ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ స్వయంగా ఆయన భార్యే ఆరోపిస్తూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. సదరు నటితో కలిసి విజయ్ తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారని, వారు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రావడం వల్ల తనకు, తన పిల్లలకు సమాజంలో అవమానకరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే ఈ ఇష్యూను సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.తన భార్య ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఏకంగా రూ. 250కోట్ల భరణం ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కోర్టులో కేసు సుదీర్ఘంగా సాగితే అది విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారట.  అందుకే, కోర్టు బయటే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి  విజయ్ ప్రతినిధులు సంగీతతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఒకవేళ సంగీత దీనికి అంగీకరిస్తే, ఆమె తన పిటిషన్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉందని మీడియా సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇందుకు ఆయన భార్య సంగీత అంగీకరిస్తారో లేదో అనేది మరింత ఉత్కంఠగా మారింది. మరోవైపు ఈ కేసుపై కోర్టు ఇప్పటికే విజయ్‌కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20న ఆయన స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అప్పటికల్లా సెటిల్‌మెంట్ పూర్తవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

1999లో పెళ్లి, ఇద్దరు పిల్లలు 

సంగీత శ్రీలంకకు చెందిన తమిళ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సోర్ణలింగం లండన్‌లో స్థిరపడిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆమె లండన్‌లోనే పెరిగారు. 1996లో విజయ్ నటించిన పూవే ఉనక్కాగా'సినిమా చూసిన సంగీత, ఆయనకు పెద్ద అభిమానిగా మారిపోయారు. కేవలం ఆయనను కలవడం కోసమే ఆమె లండన్ నుండి చెన్నైకి వచ్చారు. షూటింగ్ సెట్స్‌లో విజయ్‌ను కలిసి అభినందించిన ఆమె, ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కూడా నచ్చడంతో వీరి వివాహానికి పునాది పడింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 25, 1999న వీరి వివాహం జరిగింది. స్టార్ హీరో భార్య అయినప్పటికీ, సంగీత ఎప్పుడూ మీడియా వెలుగులకు దూరంగా ఉండటానికే ఇష్టపడతారు.

Advertisment
తాజా కథనాలు