పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు కార్మిక సంఘం నేతలు ఈ రోజు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కవిత సస్పెన్షన్, ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తారని అంతా భావించారు. కానీ కేటీఆర్ ఆ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు పార్టీలో చేరికల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందన్నారు. కేసీఆర్ పై సీబీఐ విచారణ జరపాలనుకోవడం సిగ్గుచేటన్నారు. మల్లన్నసాగర్, కొండపొచమ్మ సాగర్ లతో రాబోయే 50 ఏండ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్ ను బద్నాం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి:పాపం KCR.. అప్పుడు అన్న కూతురు.. ఇప్పుడు సొంత కూతురు!
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆగమాగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారన్నారు. కేవలం 21 నెలల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసిగిపోయారన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని అందరూ అంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోందన్నారు. వ్యవసాయ సొసైటీల ముందు రైతులు చెప్పుల వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించిందన్నారు.
ఇది కూడా చదవండి:Karnataka: కర్ణాటకలో ముసలం.. సిద్ధరామయ్య VS డీకే శివకుమార్ వర్గాలు
ఆనాటి దుర్భర రోజులను మళ్లీ తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నిజాయితీగా మోసం చేశాడని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం రూ. 2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమే స్పష్టంగా సమాధానం చెప్పిందన్నారు. అయినా.. సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రోజూ కేసీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్ అంటూ సొల్లు పురాణం చెబుతున్నారని ధ్వజమెత్తారు.
కవితను పట్టించుకోని కేటీఆర్.. రాజీనామా తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఇదే!
పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు కార్మిక సంఘం నేతలు ఈ రోజు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కవిత సస్పెన్షన్, ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తారని అంతా భావించారు. కానీ కేటీఆర్ ఆ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.