Vijayaramarao:
కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత విజయరామారావు ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లకు విజయరామారావు గుర్తొచ్చారా? అంటూ ప్రశ్నించారు. హరీష్ రావు కారణంగానే విజయరామారావు లాంటి నేతలు పార్టీ వీడారని కవిత ఈ రోజు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. కాళేశ్వరం నిర్మాణం, కుంగుబాటు, ఈ ప్రాజెక్టు పేరుతో నిధుల దుర్వినియోగానికి హరీష్ రావే బాధ్యుడని కవిత చెబుతోందన్నారు. కానీ.. ఇవన్నీ మీ నాన్న, అన్నకు తెలియకుండానే జరిగాయా? అని కవితను ప్రశ్నించారు. హరీష్ రావు మంత్రి పదవి దిగిన తర్వాత పర్యవేక్షణ అంతా మీ నాన్న చేతుల్లోనే ఉండేదని కవితకు గుర్తు చేశారు. అయితే.. ఆయన ఎందుకు సరి చేయలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మీ స్థాయి ఏంది? మీ నాన్న కేసీఆర్ స్థాయి ఏంది? అని నిప్పులు చెరిగారు. ఉద్యమం పేరుతో అంతులేని అపార తెలంగాణ ప్రజా సంపదను దోచుకోలేదని గుండెల మీద చేయి వేసుకొని కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. అదంతా ఒక్క హరీష్ రావు వల్లనే అయ్యిందా? అందులో మీరు భాగస్వాములు కాదా? మీ పాత్ర లేదా? కేటీఆర్ పాత్ర లేదా? సంతోష్ రావు పాత్ర లేదా? అని ప్రశ్నలు గుప్పించారు. నాడు బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో తమ మీద కూడా అనేక కుట్రలు జరిగాయన్నారు. అది మీ నాన్నకు మీకు తెలియదా? అని ప్రశ్నించారు.
స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ వర్ధన్నపేటలో నేను గెలవకుండా ప్రత్యర్థులకు డబ్బు సంచులు పంపించి ఓడించిన విషయం మీ నాన్నకు తెలియదా కవితమ్మ? అంటూ ధ్వజమెత్తారు. మీవల్ల ఈటెల రాజేందర్, విజయశాంతి మాత్రమే కాదు.. అనేక మంది అవమానాలను ఎదుర్కొన్నారన్నారు. పదేళ్లు దోచుకున్న సొమ్ములో వాటాల పంచాయితీ వల్లే బీఆర్ఎస్ పార్టీలో ఈ గందరగోళం ఏర్పడిందని ఆరోపించారు. సంతృప్తి లేని వాట వచ్చినందుకే కవిత ఆరోపణలు చేయడం మొదలుపెట్టిందన్నారు. వాటాల పంపిణీలో ఒత్తిడి తీసుకొచ్చినందుకే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. కవిత లేవనెత్తిన ఆరోపణలన్నింటికీ కేసీఆరే బాధ్యుడని అన్నారు.
Vijayaramarao: కవితమ్మా.. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా?.. నిప్పులు చెరిగిన విజయరామారావు!-VIDEO
కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత విజయరామారావు ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లకు విజయరామరావు గుర్తొచ్చారా? అంటూ ప్రశ్నించారు. హరీష్ రావు కారణంగానే విజయరామారావు లాంటి నేతలు పార్టీ వీడారని కవిత ఈ రోజు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఈయన వీడియో విడుదల చేశారు.