/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
Gold
పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. గత వారంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్ళీ భగ్గుమన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి లక్ష దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,00,210 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ. 91, 000 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే.. వెండి కూడా లక్ష దాటింది. కిలో వెండి రూ.1,18,90 ధర పలుకుతోంది. అయితే హఠాత్తుగా బంగారం ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. దేశీయంగా కాకుండా అంతర్జాతీయంగా జరిగే పరిణామాలపై కూడా బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. డాలర్ విలువ బలహీనపడిన నేపథ్యంలో నేడు బంగారం ధరలు సడెన్ గా పెరిగినట్లు తెలుస్తోంది.
Also Read: Thammudu Trailer: అక్క, తమ్ముడు ఎమోషన్ తో 'తమ్ముడు' ట్రైలర్ అదిరింది! ఇక్కడ చూడండి
ఇతర రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు
ఇక ఇతర రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరల విషయానికి వస్తే.. చెన్నైలో 24క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ. 99, 280 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 91000 పలుకుతోంది. ఇక ముంబై, కేరళ, పూణే, కోల్‌కతాలో కూడా ఇదే ధరలు ఉన్నాయి.
న్యూఢిల్లీలో 24క్యారెట్స్ 10 గ్రాములు రూ. 99, 430 ఉండగా.. 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 91,150 ఉంది. బరోడా, అహ్మదాబాద్ లో 24క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 99,330 ఉండగా.. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 99,105 ఉంది.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!
Also Read : ఉఫ్.. ఉఫ్.. ఆఫర్లంటే ఇవి భయ్యా - ఇన్ఫినిక్స్ గేమింగ్ ఫోన్ సూపరెహే!
నేడు వెండి ధరలు
భారతదేశంలో నేడు 1గ్రాము వెండి ధర రూ. 118.90 ఉండగా.. కిలో వెండి ధర రూ. 1,18,900 పలుకుతోంది. హైదరాబాద్ లో 1 గ్రాము రూ.1,189 ఉండగా.. కిలో వెండి ధర 1,18,90 గా ఉంది. కేరళ, చెన్నై రాష్ట్రాల్లో కూడా వెండి ఇదే ధర పలుకుతోంది.
Also Read: Gopichand33 Glimpse: గోపిచంద్ బర్త్‌డే స్పెషల్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
gold-price-today | telugu business news | latest-telugu-news | today-news-in-telugu | gold-rates-today