Thammudu Trailer: అక్క, తమ్ముడు ఎమోషన్ తో 'తమ్ముడు' ట్రైలర్ అదిరింది! ఇక్కడ చూడండి

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన  ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ విడుదలైంది. లయ, సప్తమీ గౌడ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ  జులై 4న విడుదల కానుంది. అక్కకు ఇచ్చిన మాటను నిలబెట్టే తమ్ముడి కథగా ఇది రూపొందింది. మీరు కూడా ట్రైలర్ చూడండి.

New Update

Thammudu Trailer:   నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన  ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ విడుదలైంది. లయ, సప్తమీ గౌడ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ  జులై 4న విడుదల కానుంది. అక్కకు ఇచ్చిన మాటను నిలబెట్టే తమ్ముడి కథగా ఇది రూపొందింది. ట్రైలర్‌లోని పవర్‌ఫుల్ డైలాగ్స్, విజువల్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి.

జులై 4న  థియేటర్స్ లో 

ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జులై 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన రాబిన్హుడ్ ప్లాప్ అవడంతో.. తమ్ముడు విజయం నితిన్ కెరీర్ కి కీలకంగా ఉండబోతుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. 

 ఈ చిత్రాన్ని దిల్ రాజు  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యానర్ పై  వేణు శ్రీరామ్  తెరకెక్కిస్తున్నారు.  అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో  'కాంతారా' ఫేమ్   సప్తమి గౌడ కథానాయికగా నటించగా .. లయ, వర్షా బొల్లమ్మ, లుబ్బర్ పందు ఫేమ్ స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్  కీలక పాత్రల్లో నటించారు. 

Also Read: Maldives: మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్ గా కత్రినా.. దీని వెనుక కారణం అదేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు