Chandrayaan-3: చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సిగ్నల్స్..
చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సంకేతాలు అందుతున్నాయి అని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దక్షిణ ధ్రువంలో నిద్రాణ స్థితిలోనూ చంద్రయాన్ లొకేషన్లు గుర్తిస్తోందని చెబుతున్నారు.
చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సంకేతాలు అందుతున్నాయి అని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దక్షిణ ధ్రువంలో నిద్రాణ స్థితిలోనూ చంద్రయాన్ లొకేషన్లు గుర్తిస్తోందని చెబుతున్నారు.
గుజరాత్ లోని వడోదరలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. పడవలో 27మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
అయోధ్య రామాలయంపై కర్ణాటక మంత్రి కేఎస్ రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు ఓ డేరా వేసి అందులో రెండు బొమ్మలు పెట్టి రాముడు అన్నారని చెప్పారు. రాముడి గుడికి వెళ్తే అనుభూతి వస్తుంది అయోధ్యలో నాకు అలాంటిది అనిపించలేదన్నారు.
తన స్నేహితురాలి స్థానంలో పరీక్ష రాయడానికి అమ్మాయిలా నకిలీ ఓటరు, ఆధార్ కార్డులు సృష్టించి అమ్మాయి వేషంలో పరీక్షా కేంద్రానికి వెళ్లిన యువకుడు అధికారుల తనికీలో పట్టుబడి కటకటాల పాలయ్యాడు.
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను హుజారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. సోషల్ మీడియా వేదికగా సిరాజ్ తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్గా తన పేరు మీద ఉన్న రికార్డును సిరాజ్ బ్రేక్ చేయడం సంతోషంగా ఉందని కౌశిక్ రెడ్డి అన్నారు.
మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ గత సంవత్సర కాలంలో 52శాతం కంటే ఎక్కువ రాబడి అందించాయి. అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్ తో కూడినది. రిస్క్ భరించడం.. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే ఓపిక ఉంటె కనుక ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంటు స్కీమ్ ను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపే వీటిని అమల్లోకి తేవాలని భావిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం భోగి వేడుకల్లో పాల్గొననున్నారు. సీఎం జగన్ మోసపు హామీలు, పెత్తందారి పోకడలు, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేయనున్నారు.
చికెన్, మటన్, రొయ్యలు ఇలా..నాన్ వెజ్ పచ్చళ్ళు రకరకాలున్నాయి. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ పచ్చళ్ళు తింటారు. కానీ ఎర్రచీమల పచ్చడి గురించి ఎప్పుడైనా విన్నారా...ఒరిస్సా ట్రైబల్ స్పెషల్ అయిన ఈ పచ్చడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమస్ కాబోతోంది.