Runa Mafi : తెలంగాణ(Telangana) లో కొలువుదీరిన రేవంత్(Revanth) సర్కార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీలను ప్రజలు వద్దకు చేరవేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అలాగే ఆరోగ్య శ్రీ కార్డు పరిమితి రూ.10లక్షల నుంచి రూ.15 లకు పెంచిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. లోక్ సభకు ముందే ఫ్రీ కరెంట్, రుణమాఫీ?
త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంటు స్కీమ్ ను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపే వీటిని అమల్లోకి తేవాలని భావిస్తోంది.
Translate this News: