12 బాలిక హత్యాచారానికి గురయింది. అదే ఘోరం అంటే...ఆ బాలిక సాయంకోసం అడుగుతున్న ఆఎవ్వరూ ముందు రాకపోవడం మరింత ఘోరం. రక్తంతో, నొప్పితో విలవిలలాడుతూ 8 కి.మీ నడిచిందా అమ్మాయి. సభ్య సమాజం తలదించుకునేలా, సిగ్గు చేటుగా మిగిలిన ఈ ఘటనలో పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. విచారణను ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే ఓ ఆటో డ్రైవర్ తో పాటూ మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక సాయం కోసం తిరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి ఆధారంగా విచారణ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన ఈఘటనలో బాలికను అత్యాచారం చేసింది రాకేష్ అనే ఆటో డ్రైవర్ గా గుర్తించారు పోలీసులు. అతని ఆటోలో రక్తపు మరకగలను కూడా నోటీస్ చేశామని తెలిపారు. ఇతనితో పాటూ అరెస్ట్ అయిన మరో ముగ్గురు కూడా ఆటో డ్రైవర్లే అని తేలింది. బాధితురాలు జీవన్ ఖేరీ ప్రాంతంలో రాకేష్ ఆటో ఎక్కిందని...అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ కూడా దొరికిందని పోలీసులు చెబుతున్నారు.
బాధతో అర్ధనగ్నంగా నడిచిన బాలికను రాహుల్ శర్మ అనే పూజారి రక్షించారు. ఆమెకు బట్టలు ఇచ్చి, ఆసుపత్రికి తరలించారు. ఆయనే ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. బాలిక మీద అత్యాచారం జరిగిందని తెలియగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఈ ఘటన మీద సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ప్రస్తుతం బాలిక ఇండోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణానికి ఏం ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోమంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
ఇక అత్యాచారానికి గురైన బాలిక ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమ్మాయిగా గుర్తించారు. తీవ్రమైన షాక్ లో ఉన్న ఆ అమ్మాయి తాను ఎక్కడ నుంచి వచ్చిందో, తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోతోంది. ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.