DGP: పోలీసుల అదుపులో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది.. స్పష్టం చేసిన డీజీపీ

మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సంజయ్‌ దీపక్‌ రావును అదుపుకి తీసుకున్నట్లు డీటీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో చిక్సిత పొందుతున్న సంజయ్‌ దీపక్‌ రావును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

DGP: పోలీసుల అదుపులో మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది.. స్పష్టం చేసిన డీజీపీ
New Update

మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సంజయ్‌ దీపక్‌ రావును అదుపుకి తీసుకున్నట్లు డీటీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో చిక్సిత పొందుతున్న సంజయ్‌ దీపక్‌ రావును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మావోయిస్టు కదలికలు ఉన్నట్లు డీజీపీ వివరించారు. అంతే కాకుండా తెలంగాణ బోర్డర్‌ అయిన మహారాష్ట్ర, ఒడిశాతోపాటు బీజాపూర్‌లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో మావోయిస్టుల కదలికలపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో పోలీసులు అలెర్ట్‌గా ఉన్నట్లు అంజనీకుమార్‌ పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా బస్తర్‌, జార్కండ్, పశ్చమ బెంగాల్‌, కర్నాటక ప్రాంతాల్లో సైతం మావోలు ఉన్నట్లు తెలిపిన డీజీపీ.. వారితో సంజయ్‌ దీపక్‌ రావుకు సబంధాలు ఉన్నాయన్నారు.

మరోవైపు ఉగ్రవాది సంజయ్‌ దీపక్ రావు స్వస్థలం మహారాష్ట్రలోని థానే జిల్లా అన్నారు.తాము 2022 నుంచి సంజయ్‌ దీపక్‌ రావుపై ఫోకస్‌ పెట్టినట్లు డీజీపీ తెలిపారు. మావోయిస్టు సంజయ్ దీపక్‌ రావు తండ్రి కమ్యూనిస్టు ట్రేడ్‌ యూనియన్‌ లీడర్‌ అన్నారు. సంజయ్‌ దీపక్‌ రావుకు జమ్మూ కశ్మీర్‌లోని సపెరిటీస్ట్‌ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ మావోయిస్టు మహారాష్ట్రకు ఇంఛార్జిగా పని చేసినట్లు డీజీపీ తెలిపారు. సంజయ్ దీపక్‌ రావు మొదట 2000వ సంవత్సరంలో అరెస్ట్‌ అయ్యాడన్న డీజీపీ.. జైలు నుంచి విడుదలైన అనంతరం మళ్లీ మావోలతో కార్యకలాపాలు చేపట్టారన్నారు.

2005లో ఇతన్ని కర్నాటక పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు డీజీపీ తెలిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ తిరిగి మావోలతో సంబంధాలు కొనసాగించారన్నారు. మావోయిస్టు సంజయ్‌ దీపక్ రావుకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉంటున్న ఫిల్మ్‌ ఎడిటర్‌తో పాటు మలేషియన్‌ టౌన్‌షిప్‌లో ఉంటున్న మరో ఇద్దరు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు గుర్తించామని డీజీపీ అంజనీ కుమార్‌ తేల్చి చెప్పారు. సంజయ్‌ దీపక్ రావు నుంచి పిస్టల్‌తో పాటు ఆరు రౌండ్ల బులెట్లు, ఓ ల్యాప్‌ టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ బాస్‌ తెలిపారు. ఇతనిపై మహారాష్ట్ర పోలీసులు 25 లక్షల రివార్డును ప్రకటించారన్నారు. మరోవైపు దీపక్‌ రావు ఎన్‌ఐఏ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్‌ వాండెట్‌ ఉగ్రవాదిగా ఉన్నట్లు తెలంగాణ డీజీపీ పేర్కొన్నారు.

#anjani-kumar #sanjay-deepak-rao #trizone #jammu-and-kashmir #secretary #telangana #police #maoist #bijapur #maharashtra #dgp #arrested
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe