ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల ఎక్స్ గ్రేషియా పది శాతం పెంపు

భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు.

New Update
ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల ఎక్స్ గ్రేషియా పది శాతం పెంపు

రైలు ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పదింతలు పెంచుతూ రైల్వేబోర్డు(IRCTC) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెప్టెంబర్ 18న ఉత్తర్వులు జారీ చేయగా.. అదే రోజు నుంచే పరిహారం పెంపు అమల్లోకి వచ్చింది. 2013లో చివరిసారిగా ఈ మొత్తాలు పెంచారు. కొత్త నిర్ణయం ప్రకారం రైలు ప్రమాదాల్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి 5లక్షల పరిహారం ఇస్తారు. రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.25,000 బదులు రూ.2.5 లక్షలు; స్వల్పగాయాలైనవారికి రూ.5,000 బదులు రూ.50,000 ఇస్తారు. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైళ్లలో దోపిడీలు వంటి అవాంఛిత ఘటనల సమయంలో ఈ పరిహారాలు వరుసగా రూ.1.50 లక్షలు, రూ.50 వేలు, రూ. 5 వేలుగా నిర్ణయించారు.

train accident compensation increased, announced the railway board.

ఇక ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన ప్రయాణికులకు రోజు వారి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని రైల్వే ప్రకటించింది. అది కూడా 30రోజులకు మించి ప్రయాణికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటూ అతనికి రోజుకు 3వేల చొప్పున పరిహారం చెల్లించనుంది. ప్రతీ పది రోజులకొకసారి అదనపు ఎక్స్ గ్రేషియా కూడా ఇస్తామని తెలిపింది.

train accident compensation increased, announced the railway board.

అవాంఛిత ఘటనల్లో గాయపడిన వారికి 1,500రూ ఇస్తోంది. ఇలా ఆరు నెలల వరకు ఇస్తారు. ఆ తర్వాత రోజుకు 750 రూ. చొప్పున గరిష్టంగా మరో 5 నెలల పాటూ చెల్లిస్తారు. అయితే కాపలాదారుల్లేని లెవెల్‌క్రాసింగ్‌ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకు, రైల్వే నిబంధనలను అతిక్రమించినవారికి, రైలు మార్గాల విద్యుదీకరణ వ్యవస్థ (ఓహెచ్‌ఈ) వల్ల విద్యుదాఘాతానికి గురైనవారికి మాత్రం ఎక్స్‌గ్రేషియా లభించబోదని రైల్వేబోర్డు స్పష్టంచేసింది.

Advertisment
తాజా కథనాలు