ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల ఎక్స్ గ్రేషియా పది శాతం పెంపు
భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు.