Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్. దేశంలో బంగారం ధరలు భారీగా క్షీణిస్తున్నాయి. గత పదిరోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. పది రోజుల్లో సుమారు రూ. 2500 తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడికి ఆశించినంత డిమాండ్ , ఆదరణ లభించకపోవడమే మార్కెట్లో బంగారం ధరలు పతనమవ్వడానికి కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. వచ్చేది పండగల సీజన్. దసరా, దీపావళి, పెళ్లిళ్లు వస్తుండటంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వస్తాయంటూ వ్యాపారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: నేడు ప్రపంచ జంతు దినోత్సవం..దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి..?
ఇక తాజాగా బులియన్ మార్కెట్లో బంగారం (Gold) , వెండి (Silver) ధరలు ఎలా ఉన్నాయంటే....పసిడిపై రూ. 660మేర తగ్గింది. వెండి కూడా రూ. రూ. 2000వరకు తగ్గింది. బుధవారం ఉదయం వరకు నమోదు అయిన ధరల ప్రకారం చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,200గా ఉంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 57, 380 గా నమోదు అయ్యింది. వెండి కిలో ధర రూ. 71,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీ(Delhi)లో..
10 గ్రాముల బంగారం ధర రూ.52,750
24 క్యారెట్ల ధర రూ.57,530
ముంబై(Mumbai)లో…
22 క్యారెట్ల బంగారం రూ.52,600
24 క్యారెట్లు రూ.57,380
చెన్నైలో..
22 క్యారెట్ల ధర రూ.52,900.
24 క్యారెట్ల బంగారం ధర రూ.57,710
కేరళలో..
22 క్యారెట్ల ధర రూ.53,650.
24 క్యారెట్ల బంగారం రూ.58,530,.
బెంగళూరులో..
22 క్యారెట్ల రేటు రూ..52,600. ఉండగా
24 క్యారెట్ల ధర రూ.57,380, గా ఉంది.
కోల్‌కతాలో..
22 క్యారెట్ల ధర రూ.56,600,. పలుకగా..
24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,380 గా నమోదు అయ్యింది.
హైదరాబాద్(Hyderabad)లో…
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 పలుకుతుంటే…
24 క్యారెట్ల ధర రూ.57,380 గా నమోదు అయ్యింది.
విజయవాడ , విశాఖలోనూ ఇవే ధరలు నమోదు అయ్యాయి.
వెండి కిలో ధర రూ. 71,000గా ఉంది. దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈవిధంగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి:నేను చెప్పింది.. నిజామాబాద్ సభలో మోదీ అంగీకరించారు..!!