Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్...మరింత తగ్గిన బంగారం ధరలు..కొనేందుకు మంచి ఛాన్స్..!!
బంగారానికి రెక్కలు విరిగినట్లున్నయ్...మొన్నటివరకు కొండెక్కి కూర్చున్న ధరలు గత పదిరోజులుగా పతనమౌతూ వస్తున్నాయి. ఒక్కరకంగా ఇది మహిళలకు సంతోషాన్నిచ్చే వార్తే. అయినప్పటికీ బంగారంపై ఎందుకంత మోజు తగ్గుతుంది. రానున్న కాలంలో ఇంకా తగ్గనుందా? లేదంటే వచ్చేది పండగలు, పెళ్లిళ్ల సీజన్ కాబట్టి అమాంతం పెరగనుందా? ఏది ఏమైనప్పటికీ మీరు బంగారం కొనుగోలు చేయాలన్న ప్లాన్ లో ఉంటే ఏమాత్రం చేయకుండా కొనేయ్యండి. కాగా ఈరోజు కూడా బంగారం ధర తగ్గింది. నేడు అక్టోబర్ 6వ తేదీ. ఈరోజు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 56,560 ఉండగా...22క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ. 51,800 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది.