Gold Price Today : పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త...తగ్గిన బంగారం, వెండి ధర..!!
బంగారం కొనాలనుకునేవారికి కాస్తంత ఊరట లభించింది. గతవారం రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదు అయిన వివరాల ప్రకారం..ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 53,650గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530 పలుకుతోంది. అదేవిధంగా వెండి కిలో ధర రూ. 500 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 72,100 పలుకుతోంది.