Asia Cup 2023: వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్‌ వర్మ

ఆసియా కప్‌ 2023 టోర్నీలో ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్‌ చేరిన రోహిత్‌ సేన.. లీగ్‌ దశలో నామమాత్రంగా మారిన తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది.

Asia Cup 2023: వన్డే ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తిలక్‌ వర్మ
New Update

Tilak Varma makes ODI debut in Asia Cup 2023:  ఆసియా కప్‌ 2023 టోర్నీలో ముగింపు దశకు చేరుకుంది. ఈ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఆసియా కప్‌లో ఇప్పటికే ఫైనల్‌ చేరిన రోహిత్‌ సేన.. లీగ్‌ దశలో నామమాత్రంగా మారిన తన చివరి మ్యాచ్‌ను ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి ఆరంగ్రేటం చేశాడు. ఇటీవల విండీస్‌ టూర్‌తో తిలక్‌ వర్మ వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అబ్బుర పరిచే తన ఆటతీరుతో సెక్టర్లను ఆకట్టుకున్నాడు. దీంతో బీసీసీఐ తిలక్ వర్మ వరల్డ్‌ కప్‌కు ముందు జరిగే అసియా కప్‌కు టోర్నీకి ఎంపిక చేసింది.

తిలక్‌ వర్మకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్యాప్‌ అందించాడు. మరోవైపు వచ్చిన అవకాశాన్ని సద్వినియేగం చేసుకోవాలని తిలక్‌ వర్మ చూస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తన బ్యాట్‌తో సత్తాచాటాలని చూస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసిన టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషిస్తే తిలక్‌ వర్మ రానున్న వన్డే టోర్నీకి సైతం ఎంపికయ్యే అవకాశం ఉంది.

మరోవైపు ఆసియా కప్‌లో భారత్‌ ఇప్పటికే ఫైనల్‌ చేరడంతో టీమిండియా మార్పులతో బరిలోకి దిగింది. బంగ్లాతొ జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, భారత కీలక బౌలర్‌ బుమ్రాతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌, తిలక్ వర్మ, మహ్మద్‌ షమి, ప్రసిద్ కృష్ణ, టీమిండియా స్కై సూర్య కుమార్‌ యాదవ్ జట్టులోకి వచ్చారు.

Also Read: పాక్‌కు మరో షాక్ ఇచ్చిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా

#jasprit-bumrah #asia-cup #tilak-varma #rest #kuldeep-yadav #entry #asia-cup-2023 #odi-format #virat #siraj
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe