Latest UN report On AI: నవంబర్ 2022లో, ఒపెన్ ఏఐ (OpenAI) ప్రపంచాన్ని చాట్ జీపిటి(ChatGPT)కి పరిచయం చేసింది. వివిధ రకాల AI విప్లవాన్ని క్రియేట్ చేశాయి. క్రమంగా, మరిన్ని కంపెనీలు తమ స్వంత AI సాధనాలతో ముందుకు వచ్చాయి. ఈ సాధనాలు వారి కంపెనీల్లోని ఉద్యోగాలకు సహాయపడతాయని కొందరు భావించారు. మరికొంతమంది తమ ఉద్యోగాలు పోతాయన్న ఆందోళణ వ్యక్తం చేశారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగాలలో AI భర్తీ చేస్తుందని నమ్ముతారు. ఎలోన్ మస్క్‌తో (Elon Musk) సహా సాంకేతిక నిపుణులు కూడా అభివృద్ధి చెందుతున్న టెక్ యొక్క చీకటి వైపు గురించి హెచ్చరించారు.
అయితే, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) చేసిన తాజా అధ్యయనం ప్రకారం, AI మన పని విధానాన్ని మారుస్తుంది తప్ప ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేసింది. AFP రిపోర్టు, అధ్యయనం ప్రకారం, చాలా ఉద్యోగాలు, కంపెనీలు 'పాక్షికంగా ఆటోమేషన్‌కు విధానానికి గురవుతాయని పేర్కొన్నాయి. చాట్ జీపిటి లాంటి టూల్స్ వల్ల కంపెనీలకు మేలు జరుగుతుంది. భవిష్యత్తులోనూ కొత్త టెక్నాలజీ కారణంగా ఉపాధి రంగం ప్రభావితం కాదు. నాణ్యమైన ఉద్యోగాలు, పనుల్లో మాత్రమే మార్పులు జరిగే అవకాశం ఉంటుందని నివేదికలో పేర్కొంది. అయితే ఈ కొత్త టెక్నాలజీ వల్ల పురుషులతో పోల్చినట్లయితే మహిళా ఉద్యోగులపై ఎక్కువప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: అమ్మకు ప్రేమతో…చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న కుమార్తె..!!
OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman), గత నెలలో ది అట్లాంటిక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మానవాళిపై AI ప్రభావం అంతా సానుకూలంగా ఉండదని అన్నారు. AIపై పని చేస్తున్న చాలా మంది వ్యక్తులు ఇది కేవలం మానవులకు మేలు జరుగుతుందని, వారికి సప్లిమెంట్‌గా వ్యవహరిస్తారని.. వారి ఉద్యోగాలలో ఎవరినీ భర్తీ చేయరని చెప్పాడు. అంతేకాదు ఓపెన్ ఏఐ చాట్ జీపిటి కంటే శక్తివంతంగా ఉంటుందని..అలాంటి పురోగతికి ఉద్యోగులు సిద్ధంగా ఉండరని కూడా ఆయన వెల్లడించారు.
మొత్తానికి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ రూపొందించిన తాజా నివేదికలో ఏఐ సాధనాల వల్ల ఉద్యోగులకు ఎలాంటి భయం అక్కర్లేదని తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి: మంత్రి రోజా భర్త సెల్వమణికి నాన్ బెయిలబుల్ వారెంట్