Minister Roja: మంత్రి రోజా భర్త సెల్వమణికి నాన్ బెయిలబుల్ వారెంట్

ఏపీ మంత్రి రోజాకు షాక్ తగిలింది. ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో చెన్నై జార్జ్‌టౌన్‌ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Minister Roja: మంత్రి రోజా భర్త సెల్వమణికి నాన్ బెయిలబుల్ వారెంట్

Arrest warrant to Selvamani: ఏపీ మంత్రి రోజాకు (Minister Roja) షాక్ తగిలింది. ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో చెన్నై జార్జ్‌టౌన్‌ కోర్టు (Chennai court) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో ముకుల్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్వమణి.. ముకుంద్‌చంద్‌ కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బోత్రా.. సెల్వమణి (Selvamani)పై పరువునష్టం దావా వేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో బోత్రా కన్నుమూశారు.

అయినా కానీ ఆయన కుమారుడు గగన్ మాత్రం కోర్టులో ఈ కేసు విచారణను కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ కేసు విచారణకు సెల్వమణి హాజరుకాలేదు. గతంలో కూడా చాలా సార్లు సెల్వమణి విచారణకు గైర్హాజయ్యారు. ఆయన తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు రాలేదు. దీంతో ఆయన గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 22కు వాయిదా వేశారు.

తమిళంలో పలు సినిమాలకు సెల్వమణి దర్శకత్వం వహించారు. విజయ్‌కాంత్‌తో కెప్టెన్‌ ప్రభాకర్, పులాన్ విసరానై వంటి సినిమాలు చేశారు. పోలీస్, డిటెక్టివ్, మిస్టరీ జానర్‌లలో సినిమాలు తీయడంలో పేరు దక్కించుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత ఆయన తీసిని సినిమాలు ఫ్లాప్ కావడంతో దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. అప్పటి హీరోయిన్‌ రోజాను 2002 ఆగస్టు 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె అంశుమాలిక, ఒక కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు. ఇక ప్రస్తుతం 2022-24 సంవత్సరాలకు గాను దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ) అధ్యక్షుడుగా సెల్వమణి విధులు నిర్వహిస్తున్నారు.

Also Read: స్టీవ్ జాబ్స్ రాసిన ప్రకటన లేఖ ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు