Telangana: అమ్మకు ప్రేమతో...చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న కుమార్తె..!!

జీవితంలో మొదటి తప్పటడుగు వేసినప్పటి నుంచి, కష్టం వచ్చిన ప్రతిసారీ మన వెన్నంటి ఉండి నడిపించే మొదటి గురువు. ఆశ, ప్రోత్సాహం ఇచ్చి వెన్నుతట్టే గొప్ప స్నేహితురాలు అమ్మ. అమ్మ మాత్రమే, మన పెదవిపై చిరునవ్వు కోసం తన ప్రతీ కష్టం  అమూల్యమైనదే..అమ్మకోసం...మాతృదినోత్సవం సందర్భంగా ఏకంగా చంద్రుడిపై ఎకరం భూమి కొనుగోలు చేసింది కూతురు. తల్లిమీద తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకుంది. తన తల్లికి అరుదైన బహుమతిని ఇచ్చిన ఆ కూతురు గురించి తెలుసుకుందాం.

New Update
Telangana: అమ్మకు ప్రేమతో...చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న కుమార్తె..!!

Telangana NRI purchases land on Moon: ముక్కోటి దేవతల గుడి మన అమ్మ ఒడి...ఆ అమ్మకు మదర్స్ డే (Mother's Day) సందర్భంగా ప్రత్యేక బహుమతి ఇచ్చింది కూతురు. మార్చి 8, 2022 మదర్స్ డే సందర్భంగా...చంద్రుడిపై ఎకరం భూమిని కొనుగోలు చేసేందుకు లునార్ రిజిస్ట్రేషన్ (Lunar Registration) ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఈనెల 23న వకుళ, ఆమె మనవరాలు ఆర్త పేరుపై చంద్రుడిపై ఒక ఎకరం భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. చంద్రమండలంలో తన పేరుపై కూతురు సాయి విజ్నత భూమి కొనుగోలు చేయడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. తల్లికి ఇలా బహుమతి ఇవ్వడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అడ్డంగా దొరికిన అదానీ గ్రూప్..దందాలన్నీ నిజమే..!!

పూర్తి వివరాల్లోకి వెళ్లితే...పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనలో నివాసం ఉంటున్న సింగేరేణిఉద్యోగి సుద్దాల రాంచందర్, వకుళ దేవి దంపతులకు ఇద్దరు కూతర్లు ఉన్నారు. పెద్ద కూతురు సాయి విజ్నత పదేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడింది. ఐయోవా స్టేట్ లో గవర్నర్ కిమ్ రెనాల్స్ దగ్గర ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తోంది. తన ఆఫీసులో చంద్రుడిపై భూమి కొనుగోలు విషయం గురించి ఓసారి చర్చ జరిగింది. అప్పటికే తన తల్లికి ఏదైన మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్న సాయి విజ్నత చంద్రునిపై భూమిని కొని తన తల్లికి గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.

ఈ తరుణంలో మదర్స్ డే సందర్భంగా 2022 మార్చి 8న చంద్రుడిపై ఎకరం భూమి కొనుగోలు లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసింది. ఈనెల 23న వకుళ ఆమె మనవరాలు ఆర్త పేరుమీద చంద్రుడిపై ఎకరం భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. చంద్రుడిపై తన పేరుమీద భూమి కొనుగోలు చేయడం పట్ల ఆ తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోతున్నారు.

ఆగస్టు 23న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్‌ అయిన రోజే లూనార్‌ రిజిస్ట్రీ నుంచి రిజిస్ట్రేషన్‌ పత్రాలు చేతికి అందడంతో ఆ కుటుంబం ఆనందంతో మునిగిపోయింది. ఎవరూ ఇవ్వలేని బహుమతి తన తల్లికి ఇవ్వడంతో తన కోరిక నెరవేరిందని సాయి విఘ్నత ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి:  మంత్రి రోజా భర్త సెల్వమణికి నాన్ బెయిలబుల్ వారెంట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు