TOLLYWOOD UPDATES మహేష్, అల్లుఅర్జున్, విజయ్ దేవరకొండ .. ఎక్కడ?

పెద్ద సినిమాలన్నీ మరోసారి సెట్స్ పైకి వచ్చాయి. చకచకా షూటింగ్స్ పూర్తిచేసే పనిలో పడ్డాయి. ఆగస్ట్ 15 శెలవులు, అంతకంటే ముందు వర్షాల కారణంగా కొన్ని సినిమాల షూటింగ్స్ ఆగాయి. అలాంటి మూవీస్ అన్నీ ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్స్ స్టార్ట్ చేశాయి. మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా చాలామంది హీరోల సినిమాలు చకచకా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

TOLLYWOOD  UPDATES మహేష్, అల్లుఅర్జున్, విజయ్ దేవరకొండ .. ఎక్కడ?
New Update

గుంటూరుకారం

మహేష్ బాబు (Mahesh Babu) కొత్త సినిమా గుంటూరుకారం (Guntur Kaaram) ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చాన్నాళ్లుగా సెట్స్ పై ఉంది. ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. రీసెంట్ గా మహేష్ ఫారిన్ వెళ్లడంతో మరోసారి వాయిదా పడింది. ఇన్నాళ్లకు ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలైంది. అన్నపూర్ణ స్టుడియోస్ లో మహేష్ పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.

ఈసారి కూడా గుంటూరుకారం సినిమాలో మరో మార్పు జరిగింది. ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ డ్రాప్ అయ్యాడు. అతడి స్థానంలో స్టార్ డీవోపీ మనోజ్ పరమహంసను తీసుకున్నారు. ఈరోజు నుంచి అతడే సెట్స్ పైకి వచ్చాడు. గుంటూరుకారంలో ఇలాంటి మార్పులు చాలా జరిగాయి. పూజాహెగ్డేను తప్పించారు. శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా చేశారు. మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్లపై కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.

పుష్ప-2

publive-image

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప-2 (Pushpa -2). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. అల్లు అర్జున్, రష్మికపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో అడవి సెట్ వేశారు. కొన్ని మొక్కల్ని సహజసిద్ధంగా పెంచగా, కొన్ని చెట్లను సెట్ గా వేశారు. ఈ సెట్ లోనే ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది.

విజయ్ దేవరకొండ 

ఓవైపు ఖుషి సినిమా ప్రచారంలో ఉన్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), మరోవైపు పరశురామ్ దర్శకత్వంలో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. దిల్ రాజు (Dil Raju)బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ సెట్ వేశారు. అందులో విజయ్ దేవరకొండపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమాలో దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.  శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. అలా గీతగోవిందం కాంబినేషన్ టోటల్ గా రిపీటైంది. హీరో, దర్శకుడు, హీరోయిన్, సంగీత దర్శకుడు.. ఇలా అందరూ ఒకే చోట కలిసి సినిమా చేస్తున్నారు. ఎటొచ్చి బ్యానర్ మాత్రం మారిపోయింది. గీతాఆర్ట్స్ లో సినిమా చేయాల్సిన పరశురామ్, దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఇదే సెట్స్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.

publive-image

డబుల్ ఇస్మార్ట్

హీరోలంతా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తుంటే, హీరో రామ్ (Hero Ram) మాత్రం బ్యాంకాక్ లో ల్యాండ్ అయ్యాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) అనే సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ అంతా బ్యాంకాక్ వెళ్లింది. సినిమాకు సంబంధించి ఇది రెండో షెడ్యూల్. తను ఏ సినిమా తీసినా, బ్యాంకాంక్ లో కనీసం ఒక్క షెడ్యూల్ అయినా చేస్తాడు పూరి జగన్నాధ్. అది సాధ్యం కాకపోతే, ఎట్ లీస్ట్ ఒక సాంగ్ అయినా బ్యాంకాక్ లో తీస్తాడు. డబుల్ ఇస్మార్ట్ కు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు ఈ దర్శకుడు.

Shooting Updates Double Ismart

#hero-ram #dil-raju #pushpa-2 #double-ismart #vijay-devarakonda #guntur-kaaram #trivikram #allu-arjun #mahesh-babu #mrunal-thakur
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి