/rtv/media/media_files/2026/02/09/dry-day-2026-02-09-13-14-30.jpg)
Telangana
Telangana: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ డ్రై డే ప్రకటించింది. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం, పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే మద్యం విక్రయాలపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి 11న సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేసి ఉంటాయి. అంతేకాకుండా, ఫిబ్రవరి 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ రోజు కూడా ఆయా మున్సిపాలిటీల పరిధిలో వైన్స్, బార్లను మూసివేయాలని ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది.
ముగియనున్న ఎన్నికల ప్రచారం
మరోవైపు, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. నేడు సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. ఈసారి ఎన్నికలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముగియడంతో అభ్యర్థులు నేడు చివరి నిమిషంలో సుడిగాలి పర్యటనలు, ర్యాలీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీల రెబల్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రచారం ముగియనుండటంతో అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచారు. ఎక్కడైనా మద్యం అక్రమ రవాణా జరిగినా లేదా విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Follow Us