Cyber Crime : మీ వాళ్లకు ప్రమాదం..వెంటనే డబ్బు పంపండి...పెరుగుతున్న కొత్తతరహా సైబర్ క్రైమ్

సైబర్‌ నేరగాళ్లు రూటు మార్చారు. కొత్త మార్గాల్లో  దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఆడవారు, ముసలివారిని వారు టార్గెట్‌ చేస్తున్నారు. తాజాగా వెంగళరావునగర్‌కు చెందిన వృద్ధురాలికి అపరిచితుడు వాట్సాప్‌ కాల్‌ చేశాడు. ఆమె కొడుక్కు ప్రమాదమంటూ రూ.35.23 లక్షలు కొట్టేశాడు.

New Update
CYBER CRIME

Cyber Crime

Cyber Crime : అమాయకులను బురిడీ కొట్టించి రూ. కోట్లల్లో దండుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు తమ రూటు మార్చారు. కొత్త కొత్త మార్గాల్లో  దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఆడవారు, ముసలివారిని వారు టార్గెట్‌ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ వెంగళరావునగర్‌కు చెందిన ఒక వృద్ధురాలికి అపరిచితుడు వాట్సాప్‌ కాల్‌ చేశాడు. ఆమె కుమారుడు లండన్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదానికి గురయ్యాడని.. ఐసీయూలో చేర్పించానని తెలిపాడు. అతని చికిత్స కోసం డబ్బులు కావాలని కోరాడు. కొడుకు ప్రమాదం అనగానే అది నిజమా? కాదా? అని ఆలోచించకుండా ఆమె రూ.35.23 లక్షలు పంపారు. అయితే ఈ  విషయాన్ని ఆమె తన పెద్దకుమారుడికి చెప్పడంతో అతనికి అనుమానం వచ్చింది. మోసగాడిని సంప్రదించి తమ సోదరుడి ఫొటోలు పంపాలని ప్రస్తుతం ఎలా ఉన్నాడో చూస్తామని కోరారు. దానికి నిరాకరించిన మోసగాడు ఛాటింగ్‌లో తన వివరాలు తొలగించాడు. 

Also Read: మరో దారుణం.. మహిళల హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు

అయితే ఈ నేరాలన్నీ కూడా మన సోషల్‌ మీడియా సమాచారంతోనే జరుగుతున్నాయి. మనం ఫలానా టూర్‌కు వెళ్లామని, మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడని, అతని వద్దకు వెళ్లామని, మా అమ్మాయి జర్మనీలో ఉందని తను స్నేహితులతో ఏదో టూర్‌కు వెళ్లిందని ఇలా ఫేస్‌ బుక్‌ ఇన్‌స్ర్టాలో పోస్టులు పెట్టి మురిసిపోతుంటాం. అదే మోసాలకు కారణమవుతుంది.  విమానటిక్కెట్లు.. పాస్‌పోర్టు.. ఆధార్‌కార్డుల సమాచారం సేకరించిన సైబర్‌ నేరగాళ్లు ఆ వివరాలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలకు మన రాష్ర్టం నుంచి అమెరికా, ఇంగ్లండ్, జపాన్‌ తదితర దేశాలకు ఎంతోమంది వెళ్తుంటారు.  అలా వెళ్లడానికి పలువురు ఏజెంట్లను సంప్రదిస్తుంటారు. అలా ఏజెంట్ల నుంచి వీరి డేటా కొనుగోలు చేసి కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. కొద్దిరోజులుగా విదేశాల్లో ఉన్న పిల్లలు ప్రమాదంలో చిక్కుకున్నారంటూ నకిలీ ఫోన్‌కాల్స్‌ రావడం, వారు ఏ మాత్రం ఆలోచించకుండా డబ్బులు పంపడం సర్వసాధారణమైంది. ఆ తర్వాత విషయం తెలిసి లబోదిబో అనడం పరిపాటయింది. నెల రోజులలో నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్స్‌ పరిధిలో 20-25కు పైగా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతకు అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: Bus Accident: చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం.. డివైడర్ ఎక్కడంతో స్పాట్‌లో..!

ఇలాంటి కేసుల విషయం లో అప్రమత్తంగా ఉండాలంటూ  సైబర్‌క్రైమ్‌ ఎస్సై  హిమారెడ్డి సూచిస్తు్న్నారు. విదేశాల్లోని బంధువులు, స్నేహితులు, రక్తసంబంధీకులు ఆపదలో ఉన్నారంటూ ఫోన్‌ చేసి బెదిరించటాన్ని ‘ఫేక్‌ యాక్సిడెంట్స్, ఫ్యామిలీ డిస్ట్రెస్‌ స్కామ్స్‌’ అంటారని,  సైబర్‌మోసగాళ్లు బాధితులకు వాట్సాప్, అంతర్జాతీయ ఫోన్‌నంబర్‌ ద్వారా కాల్‌చేయడం, సందేశం పంపడం చేస్తున్నారన్నారు. ఎవరైనా ఈ తరహా ఫోన్‌కాల్స్‌ చేస్తే ఆందోళనకు గురై డబ్బులు పంపొద్దని సూచించారు. సదరు వ్యక్తులకు పోన్‌ చేసి అది నిజమా? లేదా అని నిర్ధారించుకోవాలని కోరారు. అవసరం అయితే వారి స్నేహితులు, అధికారిక ఎంబసీ అధికారులతో ధ్రువీకరించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Also Read: షాకింగ్ వీడియో: నదిలో భక్తుల పడవ బోల్తా.. అరుపులు కేకలతో గందరగోళం

Advertisment
తాజా కథనాలు