/rtv/media/media_files/2025/11/05/tata-electronics-woman-employee-arrested-for-placing-camera-in-hostel-toilet-2025-11-05-15-31-33.jpg)
Tata Electronics Woman Employee Arrested For Placing Camera In Hostel Toilet
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో మరో దారుణం జరిగింది. మహిళల హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు పెట్టిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి టాయిలెట్‌లో స్పై కెమెరాను గుర్తించిన మహిళలు నిరసనలకు దిగారు. ఓ మహిళే ఈ పని చేయడం గమనార్హం. ఇక వివరాల్లోకి వెళ్తే.. టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ తమ ఉద్యోగుల కోసం హాస్టల్‌ను నిర్వహిస్తోంది. ఒడిశాకు చెందిన ఓ మహిళా ఉద్యోగి కూడా అక్కడే ఉంటోంది. ఈమెనే టాయిలెట్‌లో స్పై కెమెరాను అమర్చింది.
Also Read: సల్మాన్ ఖాన్ కు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు!
దీని ద్వార రహస్యంగా వీడియోలు షూట్ చేస్తోంది. అయితే ఆ హాస్టల్‌లో ఉంటున్న మరో మహిళకు ఆమె చేష్టలపై అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె హాస్టల్ నిర్వాహకులకు చెప్పింది. వాళ్లు తనిఖీలు చేయడంతో టాయిల్‌టో ఈ స్పై కెమెరాలు పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ ఉంటున్న దాదాపు రెండు వేల మంది మహిళలు ఆందోళనకు దిగారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితురాని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
🔴#BREAKING | Woman employee at a Tamil Nadu hostel arrested for planting camera in washroom
— NDTV (@ndtv) November 5, 2025
NDTV's @jsamdaniel joins @radhika1705 with more details pic.twitter.com/KGr41LcHmt
Also Read: డబ్బులు కట్ అవకుండా విమానాల టికెట్ రద్దు ..డీజీసీఏ ప్రతిపాదన
Follow Us