Boat Overturned: షాకింగ్ వీడియో: నదిలో భక్తుల పడవ బోల్తా.. అరుపులు కేకలతో గందరగోళం

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఘోరమైన ప్రమాదం జరిగింది. ఇవాళ (బుధవారం) ఉదయం సరయు నదిలో ఒక డింగీ పడవ బోల్తా పడింది. బర్హాజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ఘాట్ వద్ద జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

New Update
Boat Overturned in uttar pradesh deoria sarayu river video viral

Boat Overturned in uttar pradesh deoria sarayu river video viral

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఘోరమైన ప్రమాదం జరిగింది. ఇవాళ (బుధవారం) ఉదయం సరయు నదిలో ఒక డింగీ పడవ బోల్తా పడింది. బర్హాజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక ఘాట్ వద్ద జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రమాదం సమయంలో అప్పటికి పడవలో మొత్తం 12 మందికిపైగా భక్తులు ఉన్నారు. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదు. స్థానికుల సహాయంతో భక్తులందరినీ సురక్షితంగా రక్షించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Boat Overturned

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో కార్తీక పూర్ణిమ సందర్భంగా భక్తులు సరయు నదికి అవతల ఉన్న ఒక గ్రామం నుండి బర్హాజ్ థానా ఘాట్‌కు స్నానం, ప్రార్థనలు చేయడానికి డింగీ పడవ వెళ్లారు. సరిగ్గా ఉదయం 8 గంటల ప్రాంతంలో డింగీ పడవ బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న చిన్నా, పెద్దా, ముసలి ముతక అందరూ ఒక్కసారిగా నీటిలో పడిపోయారు.  

పడవ బోల్తా

వారితో పాటే వారి వస్తువులు కూడా నీటిలో పడి తేలిపోయాయి. వెంటనే వారంతా అరుపులు అరిచి, కేకలు వేశారు. వెంటనే స్థానికులు గుర్తించి.. హుటాహుటిన నీటిలో దిగి భక్తులందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అదృష్టవశాత్తూ నీటిలో మునిగి పోయిన ఏ ఒక్కరికీ ఏం కాలేదు. 

కారణం ఇదే

అయితే పడవ బోల్తా పడటానికి ప్రధాన కారణం చిన్న పడవలో ఓవర్‌లోడింగ్, నీరు నిలిచిపోవడమేనని బర్హాజ్ పోలీస్ స్టేషన్ సిఓ రాజేష్ చతుర్వేది తెలిపారు. నిషేధం ఉన్నప్పటికీ.. పడవ నడిపే వ్యక్తి యాత్రికులను ఒక చిన్న డింగీ పడవలో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడని ఆయన అన్నారు. పడవ నడిపే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

భద్రతా చర్యల కారణంగా ప్రమాదం తప్పినప్పటికీ.. దీనిని తీవ్రమైన హెచ్చరికగా చూస్తున్నామని స్థానికులు తెలిపారు. మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు