/rtv/media/media_files/2025/04/17/5BJLkNgD2kCmajb0lTpl.jpg)
Osmania Hospital
Osmania Hospital : గతంతో పోలిస్తే వైద్య రంగంలో తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించింది. అందులో హైదరాబాద్ అయితే ప్రపంచానికి మెడికల్ హబ్ అనడంతో సందేహం లేదు. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవారెందరో. ప్రైవేటు ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ ఆసుపత్రులైన హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్, గాంధీ వంటి ఆసుపత్రులు రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగుల నిర్లక్ష్యం, అతి మూలంగా కొన్నిసార్లు ఆసుపత్రులపై ఆరోపణలు వస్తున్నప్పటికీ మంచి వైద్యం అందించడంలో వైద్యులు రాజీపడరనేది వాస్తవం.
Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
తాజాగా ఉస్మానియా ఆసుపత్రి, అక్కడ అందుతున్న వైద్య సేవలు, డాక్టర్ల పనితీరుపై రవితేజ అనే ఏపీ యువకుడు ఎమోషనల్ ట్వీట్ చేశారు. తమ బంధువుల అబ్బాయి అనారోగ్యానికి గురి కాగా.. సత్వరమే స్పందించి ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు మెరుగైన వైద్య సేవలు అందించారని కొనియాడారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చినా.. ఆలస్యం లేకుండా ట్రీట్మెంట్ అందించారన్నారు. అందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు
'ఉగాది రోజున హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే ట్రైన్ రాత్రికి ఉందని.. హైదరాబాద్ చూద్దామని తిరుగుతూ ఉండగా రాయదుర్గ్ మెట్రో స్టేషన్లో మా అక్క కొడుక్కి ఒక్కసారిగా శ్వాస అందలేదు. ఏం చేయాలో తెలియని మేము కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌కి వెళ్తే అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌కి రిఫర్ చేశారు, హాస్పిటల్లో డాక్టర్స్ త్వరగా స్పందించి, X-RAY, USG చేయించారు, పేగులో రంధ్రం ఉందని ఆపరేషన్ చేయాలని చాలా త్వరితగతిన చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ లాగే చూశారు. డాక్టర్స్ దయ వల్ల బ్రతికాడు. ఇంత మంచి వైద్యం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
Also Read: బాలయ్య బర్త్ డేకి సర్ప్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్ కి పండగే..!
ఎక్కడ కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చామని ట్రీట్మెంట్ ఆలస్యం చేయలేదు, వెంట వెంటనే టెస్టులు చేయించారు. రిజిస్ట్రేషన్ చేశారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ను జన్మలో మరిచిపోలేం. ఎంత చెప్పిన తక్కువే అక్కడ డాక్టర్స్ గురించి. 108కి కాల్ చేయగానే నిమిషాలలో అంబులెన్స్ వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి వేరే లాగ ఉండేదేమో. డాక్టర్స్‌కి, అంబులెన్స్ డ్రైవర్, అక్కడ స్టాఫ్‌కి ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు.' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. నిజంగా ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్ల వైద్య సేవలు గొప్పవని అంటున్నారు. తక్షణమే డాక్టర్లు స్పందించిన తీరుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందేనని కామెంట్లు పెడుతున్నారు.
Also Read: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఉగాది రోజున హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే ట్రైన్ రాత్రికి ఉందని, హైదరాబాద్ చూద్దామని తిరుగుతూ ఉండగా రాయదుర్గ్ మెట్రో స్టేషన్లో మా అక్క కొడుక్కి ఒక్కసారిగా శ్వాస అందలేదు , ఏమి చేయాలో తెలియని మేము కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కి వెళ్తే అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్ కి రిఫర్+ pic.twitter.com/NoyKTLm40r
— రవితేజ పవనిజం✊ (@RaviTejaOnX) April 16, 2025