/rtv/media/media_files/2025/04/17/NeNaSVv6hs9mpBeX4mma.jpg)
Balakrishna
Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది జూన్ 10న తన 65వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’(Akhanda 2) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 2021లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అఖండ’కి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది.
Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్ - నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్
బాలయ్య పుట్టినరోజు కానుకగా ‘అఖండ 2’ టీజర్‌ను విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. ఇప్పటికే బోయపాటి శ్రీను టీజర్ పనులను మొదలుపెట్టారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా సందర్భంగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
గోపీచంద్ మలినేనితో సినిమా
ఇక బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఆయన తదుపరి సినిమా కూడా లాంచ్ కానుంది. బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో చేతులు కలపనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వీరసింహా రెడ్డి’ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండవసారి కలిసి మరో పక్కా మాస్ ఎంటర్టైనర్ చేయనున్నారు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
ఈ ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది. అదేవిధంగా, బాలయ్య డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుపై కూడా త్వరలోనే క్లారిటీకి వచ్చే అవకాశముంది.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని