/rtv/media/media_files/2025/04/20/WXm1oDh9lpqVd4aOVWIg.jpg)
Praneeth Dies of heart attack in Hyderabad
ఈమధ్య గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువకుల నుంచి వృద్ధుల వరకు చాలామంది అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. రాంపల్లి దాయరలో ప్రణీత్ (32) అనే యువకుడు క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో మృతి చెందాడు.
Also Read: రూల్స్ మర్చిపోయారా ఐఏఎస్ గారు...అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర వీడియో వైరల్
త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండగా అకస్మాత్తుగా అతడు కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు ప్రణీత్‌ను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రణీత్‌ను పాత బోయినపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొడుకు మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
మరోవైపు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం దుర్గాపూర్ గ్రామంలో శనివారం ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెండారు. గ్రామానికి చెందిన వడ్డెపద్ద అమృతయ్య శనివారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పని చేస్తుండగా ఒక్కసారిగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. తోటి కూలీలకు ఈ విషయం చెప్పగా.. వాళ్లు స్థానిక ఆస్పత్రికి తరలించారు. చివరికి అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!
Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!
telugu-news | rtv-news | heart-attack | cardiac-arrest