Hyderabad : ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన షేక్ మజమ్మిల్ అహ్మద్(25) శుక్రవారం కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలంటూ బాధితుడి కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను అభ్యర్థించారు.