/rtv/media/media_files/2025/07/18/young-man-died-after-hanging-himself-from-fan-2025-07-18-10-29-27.jpg)
young man died after hanging himself from fan
దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరిగిపోతుంది. అందులోనూ బలవన్మరణాలు భారీ సంఖ్యలో ఉంటున్నాయి. ప్రేమించలేదని ఒకరు.. ప్రేమకు ఒప్పుకోలేదని మరొకరు.. పెళ్లాం పుట్టింటికి వెళ్లిందని ఇంకొందరు.. ఇలా చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది.
లవర్ వదిలేసిందని సూసైడ్
వాలివేటి హితేష్ (29) అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఓ ప్రియురాలు కూడా ఉంది. అయితే కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య కొన్ని మనస్పార్ధాలు చోటుచేసుకున్నాయి. పలు కారణాల వల్ల గొడవలు జరిగాయి. దీంతో ఈమధ్యే హితేష్‌కు యువతితో బ్రేకప్ అయింది.
దీంతో లవర్ వదిలేయడంతో హితేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆ యువతితో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ కుంగిపోయాడు. ఆమె మళ్లీ తన జీవితంలోకి తిరిగి రాదని భావించి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దీంతో హైదరాబాద్ రాయదుర్గంలోని ల్యాంకో హిల్స్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న హితేష్.. ఫ్యాన్‌కు ఉరేసుకుని చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం తమ్ముడు ప్రమోద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హితేష్ తన తమ్ముడు, ఇద్దరు ఫ్రెండ్స్‌తో ల్యాంకోహిల్స్‌లో ఉంటున్నాడు.