TG News : జస్ట్‌ మిస్‌.. జర్రయితే ప్రాణాలు పోతుండేరా..

రంగారెడ్డి జిల్లాలో ఓ కార్మికుడు పని ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో దారిలో ఉన్న రైల్వే పట్టాలు దాటుతున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న గూడ్స్ రైలు కదిలింది. వెంటనే చాకచక్యంగా వ్యవహరించి పట్టాల మధ్యలో పడుకున్న కార్మికుడు తన ప్రాణాలను కాపాడుకున్నాడు.

New Update
Worker saves his life by lying under a train

Worker saves his life by lying under a train

అనుకోని ప్రమాదం ఎదురైనపుడు తృటిలో తప్పించుకుంటే..జస్ట్‌మిస్  జ ర్రయితే ప్రాణాలు పోతుండేరా అనుకుంటాం. ఇంకా చెప్పాలంటే వాడికి భూమి మీద నూకలున్నయిరా అంటారు. అయితే కొన్ని ప్రమాదాలు తప్పించుకోవడానికి సమయస్ఫూర్తితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో  చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్‌ ఒక పారిశ్రామిక ప్రాంతం. అక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి. తిమ్మాపూర్‌ రైల్వేస్టేషన్‌కు దగ్గరలో  కార్మికులు నివసించేందుకు క్వాటర్లు ఉండగా, మరోవైపు పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఇక్కడ పట్టాలు దాటేందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉన్నప్పటికీ ఎక్కువ మంది పట్టాల మీద నుంచే దాటుతుంటారు. గురువారం కూడా అలాగే జరిగింది.

Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

Worker Saves His Life

స్థానికంగా ఒక కంపెనీలో పనిచేసే ఓ కార్మికుడు తన పని  ముగించుకుని ఇంటికి బయలు దేరాడు. ఆయన వెళ్లే దారిలో అతను రైల్వే పట్టాలు దాటాల్సి ఉంటుంది. రోజులాగే ఈ రోజు కూడా అదే దారిలో బయలు దేరాడు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ఎప్పటిలాగే రైలు పట్టాలు దాటుతున్నాడు. అయితే అప్పుడే అనుకోని సంఘటన జరిగింది. అప్పటివరకు ఆగిఉన్న గూడ్స్ ట్రైన్ ఒక్కసారిగా ముందుకు కదిలింది. దాన్ని గమనించకపోతే ఆ కార్మికుడు ప్రాణాలు పోగొట్టుకునే వాడే .కానీ అప్పుడే అతని బుర్ర చాకచక్యంగా పనిచేసింది. ఆ కార్మికుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పట్టాల మధ్యలో పడుకున్నాడు. గూడ్స్ ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత లేచి తన ప్రాణాలు కాపాడుకున్నాడు.

Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!

గురువార సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.  ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  

Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే

Also Read :  ఇజ్జత్ పోయిందిపో... సొంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానం

 

railway-station | ranga-reddy-dist | rangareddy

Advertisment
Advertisment
తాజా కథనాలు